Meera Jasmine : అస్స‌లు త‌గ్గ‌నంటున్న మీరా జాస్మిన్.. ప‌ల‌చ‌ని డ్రెస్‌లో మొత్తం చూపించేస్తుందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: October 20, 2022, 4:30 pm

Meera Jasmine : మలయాళీ భామ మీరా జాస్మిన్ ఇటీవ‌లి కాలంలో త‌న గ్లామ‌ర్ షోతో తెగ హాట్ టాపిక్‌గా మారుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు ఈ అమ్మ‌డు మన తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. సినిమా అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.ఏమైందో ఏమో కానీ కొన్నాళ్ల నుంచి మీరా జాస్మిన్ మళ్లీ సినిమాల మీద ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఆమె అందాల ఆరబోతనే మార్గంగా ఎంచుకుంది. ఈమధ్య కాలంలో వరుసగా అందాలు ఆర‌బోస్తూ ఫోటో షూట్లు షేర్ చేస్తూ వచ్చింది. మీరా జాస్మిన్ కొన్నాళ్ల క్రితం లో దుస్తులతో కొన్ని ఫోటోలు షేర్ చేసి షాకిచ్చింది. ట్రాన్స్ పరెంట్ బ్లాక్ డ్రెస్ లో యద అందాలు దాదాపు చూపించేసింది. మీరా జాస్మిన్ తెగింపుకు జనాలు మైండ్ బ్లాక్ అవుతుంది.

మీరా జాస్మిన్ అంటే రన్, పందెం కోడి, భద్ర వంటి సూపర్ హిట్ చిత్రాలు గుర్తొస్తాయి.అలాగే ఆమెకు హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ఉంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న మీరా వెండితెరపై నిండైన బట్టల్లో సాంప్రదాయంగా కనిపించారు. తెలుగులో ఆమె నటించిన భద్ర మంచి విజయాన్ని అందుకుంది. విశాల్ పందెం కోడి చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధించగా ఆమెకు గుర్తింపు వచ్చింది. ఓ దశలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ ఆమెకు దక్కింది. బాలకృష్ణతో మహారథి చిత్రంలో మీరా జాస్మిన్ నటించారు. పవన్ కి జంటగా గుడుంబా శంకర్ మూవీ చేశారు.

meera jasmine cute looks

meera jasmine cute looks

Meera Jasmine : అబ్బా అనిపించే అందం..

అయితే ఈ రెండు చిత్రాలు అనుకున్నంతగా ఆడలేదు. భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో ఈ హీరోయిన్ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత చాలానే సినిమాలు చేసినప్పటికీ.. కెరీర్ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు. కొన్నాళ్లు సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా కూడా తెరిచి అందాల‌తో మ‌త్తెక్కించే ప్ర‌య‌త్నం చేస్తుంది.ఆ మధ్య మీరా జాస్మిన్ వ్యక్తిగత సమస్యలతో బాధపడినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అయితే పూర్తి క్లారిటీ లేదు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp