Mega 157 Pooja : చిరంజీవి- అనీల్ రావిపూడి మూవీ ఓపెనింగ్.. స్పెషల్ అట్రాక్షన్‌గా వెంకటేష్
Mega 157 Pooja : మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరోగా మారాడు. ఇవాళ ఉగాది శుభముహూర్తాన మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో కొత్త చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. దీనిపై చిరంజీవి సోషల్ మీడియాలో స్పందించారు. ఈ ఉగాది సందర్భంగా అద్భుతమైన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల బృందంతో ప్రయాణాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు.
Mega 157 Pooja : చిరంజీవి- అనీల్ రావిపూడి మూవీ ఓపెనింగ్.. స్పెషల్ అట్రాక్షన్‌గా వెంకటేష్
ఈ సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రియమైన వెంకీ మామా, ఇతర సినీ స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించారు. సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.సోషియో-ఫాంటసీ విశ్వంభర విడుదలకు రెడీ అవుతుండగా, మెగాస్టార్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడితో కలిసి ఒక ఎక్సయిటింగ్ న్యూ ఎంటర్టైనర్ కోసం చేతులు కలిపారు.
8 చిత్రాలకు 8 బ్లాక్ బస్టర్లతో అద్భుతమైన విజయ పరంపరను కొనసాగించిన అనిల్ రావిపూడి..లేటెస్ట్ రిలీజ్ సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, రికార్డులను బద్దలు కొట్టి, 300 కోట్ల గ్రాస్‌ను దాటింది.ఇప్పుడు చిరంజీవితో ఎలాంటి సినిమా చేస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ క్లాప్ ఇచ్చారు, అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. లెజెండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు.
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.