Varun Tej – Lavanya Tripathi : వరుణ్ – లావణ్య పెళ్లిలో పెద్ద తప్పు చేసిన నాగబాబు ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Varun Tej – Lavanya Tripathi : వరుణ్ – లావణ్య పెళ్లిలో పెద్ద తప్పు చేసిన నాగబాబు ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :2 November 2023,5:00 pm

Varun Tej – Lavanya Tripathi : ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే వరుణ్ తేజ్ పెళ్ళిలో ఆయన తండ్రి నాగబాబు చేసిన తప్పును సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు. సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం కళ్యాణ మండపం అంటే గుడిలా భావిస్తారు. అలాగే నూతన వధూవరులను అక్కడ కూర్చో పెట్టినప్పుడు దేవుళ్ళుగా భావిస్తారు.

అలాంటి మండపం పైకి చెప్పులేసుకుని నాగబాబు వెళ్లారు. అయితే నాగబాబు మాత్రం ఆ విషయాన్ని మరిచి చెప్పులు వేసుకున్నారు. మిగతా హీరోలు చెప్పులు లేకుండా కళ్యాణ మండపాని ఎంతో గౌరవంగా భావిస్తే నాగబాబు మాత్రం ఇలా చెప్పులు వేసుకోవడం తన కొడుకు పెళ్లిని అవమానించినట్లే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై నెట్టింట వైరల్ గా మారింది. సొంత కొడుకు పెళ్లిలో నాగబాబు ఎందుకు ఇలా చేశాడు అని కొందరు అంటూ ఉంటే మరికొందరు మాత్రం ఏదో తెలియక పొరపాటున ఇలా చేశారని, మరిచి పోయి ఉంటాడు లే అని అంటున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే గా అని ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుణ్ లావణ్య పెళ్లి ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ చేసిన సందడి రెండు తెలుగు రాష్ట్రాలలో వైరల్ గా మారాయి. ఇకపోతే వరుణ్ లావణ్యలు కలిసి మిస్టర్ ,అంతరిక్షం సినిమాలలో నటించారు. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త పెళ్లిదాకా వెళ్ళింది. కానీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు ఎక్కడ బయట పడలేదు. ఒక్కసారిగా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది