Mega Family : ఎన్నికల ప్రచారానికి దూరంగా మెగా ఫ్యామిలీ.. కూటమినే కారణమా..?
ప్రధానాంశాలు:
Mega Family : ఎన్నికల ప్రచారానికి దూరంగా మెగా ఫ్యామిలీ.. కూటమినే కారణమా..?
Mega Family : ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓవైపు వైసీపీ ఒంటరి పోరుచేస్తుంటే మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. అయితే మెగా ఫ్యామిలీ ఎన్నికల బరిలోకి దిగనట్లే అని, కూటమి పోరులో జనసేనాని ఫ్యామిలీని దూరం పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ఎన్నికల ప్రచార బరిలోకి దిగటానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇంకా మిగతా ఫ్యామిలీ అంతా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాళ్ల ప్రకటన జనసేనాని పోరాటం చూసి ఒకానొక సమయంలో మళ్ళీ మెగా ఫ్యామిలీ అంతా దిగటం లాంఛనమే అనుకున్నారు.
అప్పట్లో ప్రజారాజ్యం కోసం చిరంజీవి మెగా హీరోల్ని ఎలా తెరపైకి తీసుకొచ్చారో జనసేనాని కూడా తెస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు అందుకు ఆస్కారం ఏమాత్రం లేదని తెలుస్తుంది. జనసేన, టీడీపీ తో కలిసి ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ఎవరిని దించే అవకాశం లేదు. కొత్తగా కూటమిలోకి బీజేపీ కూడా చేరింది కాబట్టి అసలు అవకాశం లేదని తెలుస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సోలో గానే ప్రకటించారు. అప్పటినుంచి సోలోగానే జనాల మధ్యలో తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ఏ మెగా హీరోని తన పార్టీ కోసం, క్యాంపెనింగ్ కోసం రమ్మని పిలవలేదు. మెగా ఫ్యామిలీ హీరోలంతా తమకు తాముగా స్వచ్ఛందంగా వస్తామన్నారు తప్ప పవన్ కళ్యాణ్ ఆహ్వానించింది లేదు.
కేవలం నాగబాబును మాత్రమే పార్టీలోకి ఆహ్వానించి కొన్ని పనులు అప్పగించారు. మధ్యలో ఆయన కూడా కొంత గ్యాప్ తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ నాగబాబు యాక్టివ్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ కనుక సింగిల్ గా పోటీ చేస్తే మెగా సైన్యం అంతా ప్రచార బరిలోకి దిగటానికి అవకాశం ఉండేది. జనసేనాని ఒంటరి పోరాటానికి తోడుగా వాళ్లు కూడా జత కలిసే వారు. చిరంజీవి దూరంగా ఉన్న రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అవసరం అనుకుంటే బన్నీ కూడా సీన్లోకి వచ్చేవారు. కానీ తాజా సన్నివేశం చూస్తుంటే అది కనిపించడం లేదు. అయితే నాగబాబు పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం నుంచైనా మెగా ఫ్యామిలీ ఎన్నికల ప్రచారానికి దిగుతుందేమో చూడాల్సి ఉంటుంది. అయితే కూటమి కారణంగా జనసేనాని తన ఫ్యామిలీని ఎన్నికల ప్రచారానికి దింపకపోవచ్చు అని అంటున్నారు.