Megastar : మెగాస్టార్… నీకు అంత సీన్‌ లేదు భయ్యా

Authored By aruna | The Telugu News | Published on: August 8, 2022, 12:20 pm

Megastar : నందమూరి కళ్యాణ్‌ రామ్‌-Kalyan Ram హీరోగా వచ్చిన బింబిసార-Bimbisara మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక మంచి కథను కళ్యాన్ రామ్‌ నటనతో ఆకట్టుకునేలా చేశాడు. ఆ కథ కు పెద్ద హీరో అయ్యి ఉంటే వంద కోట్ల సినిమా అయ్యి ఉండేది.. పాన్ ఇండియా స్థాయి లో ఓ రేంజ్ లో బింబిసార ఆడేది. కాని కళ్యాణ్ రామ్ కు ఉన్న వరుస ప్లాప్ ల ట్రాక్ రికార్డ్‌ కారణంగా బింబిసార సినిమాకు ఒక మోస్తరు బిజినెస్ జరిగింది.. అంతే కాకుండా ఒక మోస్తరుగానే ఓపెనింగ్‌ వసూళ్లు నమోదు అయ్యాయి. లాంగ్ రన్ లో ముప్పై నుండి నలబై కోట్లు రాబడితే గొప్ప విషయం అన్నట్లుగా ఉంది.

ఇదే సమయంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ను సోషల్‌ మీడియా లో మెగాస్టార్ నందమూరి కళ్యాన్ రామ్‌ అంటూ కొందరు అభిమానులు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. నందమూరి కళ్యాణ్ రామ్‌ ఒక్క సక్సెస్ అవ్వగానే మెగా స్టార్ అయ్యాడా అంటూ మెగా ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ లో ఏ ఒక్కరికి మెగాస్టార్‌ ట్యాగ్‌ సెట్‌ అవ్వదు అని.. మెగా అనేది కేవలం చిరంజీవికి మాత్రమే వర్తిస్తుంది అంటూ మెగా ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

mega fans angry on nandamuri fans and kalyan ram

mega fans angry on nandamuri fans and kalyan ram

ఈ విషయంలో కొందరు మెగా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ కు యాంటీ ఫ్యాన్స్ గా మారి వాదనకు దిగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ రచ్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది. మొన్న మెగా స్టార్‌ నందమూరి కళ్యాణ్ రామ్‌ హ్యాష్ ట్యాగ్‌ ఏకంగా జాతీయ స్థాయి లో ట్విట్టర్‌ లో ట్రెండ్‌ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా 15 వేలకు పైగా మెగా స్టార్‌ కళ్యాణ్‌ రామ్‌ అంటూ ట్వీట్స్ పడటం తో అంతా అవాక్కయ్యారు. కళ్యాణ్‌ రామ్‌ ఈ విషయమై స్పందించక పోవడంతో నీకు అంత సీన్ లేదు భయ్యా… నువ్వు అయినా స్పందించాలి కదా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ రామ్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.

aruna

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp