Megastar : నన్ను క్షమించండి .. తప్పు చేశాను ” అన్నీ మూసుకుని సారీ చెప్పిన మెగాస్టార్ !
Megastar : మెగాస్టార్ మమ్ముట్టి, Megastar Mammootty ‘ 2018 ‘ మలయాళ సినిమాకి సంబంధించిన టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. ఇది 2018 లో సంభవించిన కేరళ వరదల ఆధారంగా తెరకెక్కించిన సినిమా. టీజర్ లాంచ్ సందర్భంగా ప్రచార వేదికపై డైరెక్టర్ జూడ్ ఆంథోనీ హెయిర్ స్టైల్ పై ముమ్ముట్టి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ముమ్ముట్టి చేసిన కామెంట్ ఏంటంటే జూడ్ ఆంథోనీ తలపై వెంట్రుకలు […]
Megastar : మెగాస్టార్ మమ్ముట్టి, Megastar Mammootty ‘ 2018 ‘ మలయాళ సినిమాకి సంబంధించిన టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. ఇది 2018 లో సంభవించిన కేరళ వరదల ఆధారంగా తెరకెక్కించిన సినిమా. టీజర్ లాంచ్ సందర్భంగా ప్రచార వేదికపై డైరెక్టర్ జూడ్ ఆంథోనీ హెయిర్ స్టైల్ పై ముమ్ముట్టి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ముమ్ముట్టి చేసిన కామెంట్ ఏంటంటే జూడ్ ఆంథోనీ తలపై వెంట్రుకలు లేకపోయినా అసాధారణమైన మెదడు కలిగిన అత్యంత ప్రతిభావంతుడైన ఫిలిం మేకర్ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అభిమానులకు అస్సలు నచ్చలేదు.
మెగాస్టార్ నేరుగా బట్టతల ఉన్నవారని అవమానించారని భావించారు. అయితే దీనిని గ్రహించిన తర్వాత తన అధికారిక సోషల్ మీడియాలో ఇలా ప్రకటన చేసినందుకు విచారం వ్యక్తం చేశారు. డియర్ ఆల్ నిన్న జరిగిన 2018 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ జూడ్ ఆంథోనీని పొగిడేందుకు ఉపయోగించిన పదాలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఇలాంటివి మళ్లీ జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను. దీనిని నా దృష్టికి తీసుకువచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు అని మమ్ముట్టి పోస్ట్ చేశారు. మమ్ముట్టి పోస్ట్ పై జూడ్ ఆంథోనీ కూడా స్పందించారు.
మెగాస్టార్ కి తనపై ఉన్న ప్రేమ గురించి బాగా తెలుసుననీ, తన ప్రతిభను మెచ్చుకోవడానికి ఆయన ఉపయోగించిన పదాలను తప్పుగా ఉపయోగించవద్దని నెటిజన్లను అభ్యర్థించారు. జూడ్ ఆంథోనీ తన జుట్టు రాలడానికి బెంగళూరు కార్పొరేషన్ నీటి సరఫరా, వివిధ షాంపూ బ్రాండ్ లను ఉత్పత్తి చేసే సంబంధిత వ్యక్తులందరినీ విమర్శించాలని కూడా సరదాగా వ్యాఖ్యానించారు. నా హెయిర్ స్టైల్ నా ఫేవరెట్ స్టార్ ఇబ్బందుల్లోకి నెట్టిదని విచారం వ్యక్తం చేశారు. ముమ్ముట్టి తన తప్పును తెలుసుకొని వెంటనే క్షమాపణలు చెప్పినందుకు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.