రాం చరణ్ ట్వీట్ లో అంత అర్థం ఉందా .. షాకవుతున్న మెగా ఫ్యాన్స్ ..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

రాం చరణ్ ట్వీట్ లో అంత అర్థం ఉందా .. షాకవుతున్న మెగా ఫ్యాన్స్ ..!

రాం చరణ్ తాజాగా రవితేజ నటించిన క్రాక్ సినిమా చూశాడట. క్రాక్ సినిమా రాం చరణ్ కి విపరీతంగా నచ్చిందని చిత్ర యూనిట్ ని ప్రశంసించాడు. సాధారణంగా ఒక హీరో మరొక హీరో సినిమా చూసేంత సమయం దొరకడం చాలా కష్టం. అది కూడా రాం చరణ్ లాంటి స్టార్ హీరో కం ప్రొడ్యూసర్ కి ఇంకా కష్టం. రాం చరణ్ ఒక వైపు ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తండ్రి […]

 Authored By govind | The Telugu News | Updated on :13 January 2021,7:23 pm

రాం చరణ్ తాజాగా రవితేజ నటించిన క్రాక్ సినిమా చూశాడట. క్రాక్ సినిమా రాం చరణ్ కి విపరీతంగా నచ్చిందని చిత్ర యూనిట్ ని ప్రశంసించాడు. సాధారణంగా ఒక హీరో మరొక హీరో సినిమా చూసేంత సమయం దొరకడం చాలా కష్టం. అది కూడా రాం చరణ్ లాంటి స్టార్ హీరో కం ప్రొడ్యూసర్ కి ఇంకా కష్టం. రాం చరణ్ ఒక వైపు ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తండ్రి మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమాని నిర్మిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Ravi Teja's next with Gopichand Malineni titled as 'Krack'; kicks-off with a pooja ceremony | Telugu Movie News - Times of India

ఏ రకంగా చూసుకున్నా రాం చరణ్ ఫుల్ బిజీ. అయినా రవితేజ నటించిన క్రాక్ సినిమా చూడటం .. ఆ సినిమా గురించి ప్రత్యేకంగా ట్విట్టర్ వేదికగా ప్రస్తావించడం చూసి ఇండస్ట్రీ వర్గాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా క్రాక్ సినిమా చెప్పాలంటే రవితేజ – దర్శకుడు గోపీచంద్ మలినేని మొండి ధైర్యం తో సినిమా బ్లాక్ బస్టర్ అన్న నమ్మకంతో థియేటర్స్ లోకి తీసుకు వచ్చారు. అంతేకాదు ఈ సినిమాతో ఇద్దరు హ్యాట్రిక్ అందుకున్నారు. రాజా ది గ్రేట్ తర్వాత మళ్ళీ ఇంత కాలానికి రవితేజ స్టామినాకి తగ్గ హిట్ పడింది.

Ravi Teja: Ravi Teja's 'Nela Ticket' to unveil first look on March 18 | Telugu Movie News - Times of India

అలాగే దర్శకుడికి .. హీరోయిన్ శృతిహాసన్ కి సాలీడ్ హిట్ దక్కింది. ఇదే విషయాన్ని మెగా పవర్ స్టార్ రాం చరణ్ వెల్లడించాడు. సినిమా అద్భుతంగా ఉందని .. రవితేజ కి సూపర్ హిట్ దక్కినందుకు చాలా ఆనందంగా ఉందని చెపుకొచ్చాడు. హీరో రవితేజ – దర్శకుడు గోపీచంద్ మలినేని – హీరోయిన్ శృతిహాసన్ ని ప్రత్యేకంగా అభినందించాడు. అయితే ఈ ట్వీట్ వెనక ఒక సూపర్ న్యూస్ కూడా ఉందని మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని టాలెంట్ ని ఇంతగా మెచ్చుకుంటున్నాడంటే ఖచ్చితంగా చరణ్ నెక్స్ట్ సినిమా అవకాశం గోపీచంద్ మలినేని కి ఇస్తాడని చెప్పుకుంటున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది