Home » Entertainment » Mega Nandamuri Heroes Ntr Acted With Sai Dharam Tej
Entertainment

Mega – Nandamuri Heroes : మెగా, నంద‌మూరి హీరోలు బావ‌బామ్మ‌ర్దులు కాబోతున్నారా.. ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Authored By
Sam C
The Telugu News | Published on: July 22, 2022, 7:30 pm
Advertisement

Mega – Nandamuri Heroes : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో టాప్ ఫ్యామిలీస్‌లో మెగా, నంద‌మూరి కుటుంబాలు త‌ప్ప‌క ఉంటాయి. ఈ ఫ్యామిలీ హీరోల సినిమా ఏది వ‌చ్చినా కూడా ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తి బాగానే ఉంటుంది. ఇక ఈ ఫ్యామిలీ హీరోలు కలిసి సినిమా చేస్తే బాక్సాఫీస్ షేక్ కావ‌డం ఖాయం. ఇటీవ‌ల ఎన్టీఆర్, రామ్ చ‌ర్‌ణ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్క‌గా, ఈ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికీ ఆర్ఆర్ఆర్ చిత్రం అనేక రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇక మ‌రోసారి నంద‌మూరి హీరో మెగా హీరో కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతుంద‌నే వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Advertisement

ఆర్ఆర్ఆర్ మూవీతో భారీ హిట్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్… కొరటాల శివ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఆచార్య మూవీ ఆర్థిక ఇబ్బందుల నుండి దర్శకుడు కొరటాల బయటపడలేదు. ఈ కారణంగా ఎన్టీఆర్ 30 చిత్రం సెట్స్ పై కెళ్ళడం ఆలస్యం అవుతుంది. కాగా ఆగస్టు నుండి ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. ఈ మూవీలో మెగా హీరో సాయి ధరమ్ జాయిన్ కానున్నారట. కథ రీత్యా ఎన్టీఆర్ బావమరిదిగా సాయి ధరమ్ తేజ్ పాత్ర ఉంటుందట. ఇక సాయి ధరమ్ తేజ్ పాత్రకు హీరోయిన్ కూడా ఉంటుందట.

Mega – Nandamuri Heroes and ntr acted with sai dharam tej

Advertisement

Mega – Nandamuri Heroes : సాకారం అవుతుందా?

ఆ విధంగా ఎన్టీఆర్ – సాయి ధరమ్ తేజ్ బావా బామ్మర్దులుగా కనిపిస్తారని సమాచారం. ఇది జ‌రిగితే మ‌రోసారి నంద‌మూరి, మెగా ఫ్యాన్స్‌కి మాంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ దొరికిన‌ట్టే అని చెప్పాలి. అప్పుడెప్పుడో ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించారు. దశాబ్దాల తర్వాత రాజమౌళి ఇది సాధ్యం చేసి చూపించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇక వెండితెరపై సాయి ధరమ్, ఎన్టీఆర్ లను కలిసి చూడడం నిజంగా గొప్ప అనుభూతి పంచుతుంది. కావున ఈ కాంబో సాకారం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ త్వ‌ర‌లో ప‌వ‌న్‌తో క‌లిసి రీమేక్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి