Roja : ఇక జబర్దస్త్ షోకు దూరం!.. మొత్తానికి ప్రకటించిన రోజా
Roja : గత కొన్ని రోజులుగా రోజా బుల్లితెరపై కనిపించడం లేదు. వెకిలి చేష్టలు, పిచ్చి పిచ్చి కామెంట్లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కనిపించడం లేదు. రోజా బుల్లితెరపై కనిపించకపోవడంతో కొన్ని ఊహాగానాలు వచ్చాయి. ఆమెకు మంత్రి పదవి దక్కుతుండటంతో ఇలాంటి షోలకు దూరంగా ఉంటోందని టాక్ వచ్చింది. మొత్తానికి ఇప్పుడు అదే నిజమైంది. తాజాగా రోజా సంచలన ప్రకటన చేసింది.తాను ఇన్నేళ్లు కలలు కన్న మంత్రి పదవి దక్కడంతో రోజా అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకుంది. అప్పుడు ఐరన్ లెగ్ అన్నారు,
ఇప్పుడు రాష్ట్రానికి మంత్రిని అయ్యాను మంత్రి పదవి దక్కడంతో.. సినిమాలకు, జబర్దస్త్ కు ఇక దూరం అవుతున్నా అంటూ రోజా ప్రకటించేసింది. దాదాపు పదేళ్లుగా జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా ఇక ఇప్పుడు ఈ షోకు దూరంగా ఉంటోంది.సినిమాలు, షూటింగ్‌లు బంద్ చేస్తున్నా.. జగనన్న ఇచ్చిన మంత్రి పదవికి న్యాయం చేస్తానంటూ రోజా ప్రకటించేసింది. మొత్తానికి రోజాకు ఏ శాఖను కేటాయిస్తారో గానీ జబర్దస్త్ షోకు మాత్రం దూరమైంది. ఇక సినిమాల్లోనూ కనిపించను అని తేల్చి చెప్పేసింది.

Minister RK Roja Anounces That She Quits Jabardasth
మరో వైపు రోజాకు రీప్లేస్ మెంట్ కూడా వచ్చేసింది. రోజా స్థానాన్ని బుల్లితెరపై భర్తీ చేసేందుకు ఇంద్రజ రెడీగానే ఉంది.రోజా వెళ్లిపోవడంతో బుల్లితెరపై ఇంద్రజ క్రేజ్ ఎక్కువయ్యేట్టు ఉంది. అసలే రోజా వద్దు ఇంద్రజ ముద్దు అనే స్లోగన్ ఎక్కువైంది. ఇక ఇప్పుడు రోజా తనంతట తానే తప్పుకుంది. మంత్రి పదవి రావడంతో రోజా వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ, జాతిరత్నాలు, జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఇలా అన్ని షోలకు ఇంద్రజే న్యాయ నిర్ణేతగా ఉంటుందేమో చూడాలి.