Roja Daughter | అమెరికాలో రోజా కూతురు అన్షు మాలికకు ప్రతిష్టాత్మక అవార్డు.. పోస్ట్ వైరల్
Roja Daughter | నటి, మాజీ మంత్రి ఆర్.కె. రోజా కూతురు అన్షు మాలిక చిన్ననాటి నుంచి ట్యాలెంటెడ్ గా గుర్తింపు పొందుతోంది. రచయిత్రిగా పుస్తకాలు రాయడం నుంచి, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వరకూ అన్షు అనేక రంగాల్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె అమెరికాలోని బ్లూమింగ్టన్, ఇండియానా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఈ తరుణంలో, అన్షుకు ఓ అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు లభించడం ఎంతో గర్వకారణం.

#image_title
గ్రేట్ అచీవ్‌మెంట్..
ఇండియానా వర్సిటీ తరఫున ప్రదానం చేసే “మౌరిన్ బిగ్గర్స్ అవార్డు 2025–26” కు అన్షు ఎంపికయ్యింది. ఈ అవార్డు, టెక్నాలజీలో మహిళల కోసం సమానావకాశాలు, సహకారం, సామాజిక ప్రభావాన్ని పెంపొందించే వారికి ప్రదానం చేయబడుతుంది. అన్షు టెక్ రంగంలో మహిళల సాధికారత కోసం చేసిన కృషికి ఈ అవార్డు వరించిందని వర్సిటీ అధికారికంగా ప్రకటించింది.
అన్షు చేసిన ముఖ్యమైన కార్యకలాపాలు ఏంటంటే… నమీబియా, నైజీరియా, భారత్ వంటి దేశాల్లో వెనుకబడిన వర్గాల కోసం కోడింగ్ శిక్షణ శిబిరాలకు నాయకత్వం, మహిళలకు వెబ్ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమాలు, పేదవర్గాలకు టెక్నాలజీని అందించేందుకు సోషల్ మీడియా ద్వారా చైతన్యం,గ్లోబల్ స్థాయిలో టెక్ విద్యపై అధ్యయనాలు, సదస్సుల్లో పాల్గొనడం.. ఈ అన్ని అంశాలు అన్షు ఎంపికలో కీలకపాత్ర వహించాయని వర్సిటీ తెలిపింది.తనకు ఈ అవార్డు లభించిన విషయాన్ని అన్షు స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది.