Minister Roja : ఈ యువతి డ్యాన్స్ చూసి తట్టుకోలేకపోయిన మంత్రి రోజా.. కుర్చీలోనే కూర్చొని ఏం చేసిందో చూడండి.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 2 January 2023, 3:40 pm

Minister Roja : మంత్రి రోజా అంటే తెలుసు కదా. తను అన్నింట్లో ఆల్ రౌండర్. సినీ నేపథ్యం నుంచి వచ్చిన రోజా అటు సినిమాల్లో, ఇటు టీవీ షోలలో.. మరోవైపు రాజకీయంగా అన్ని రంగాల్లో రాణిస్తూ తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించున్నారు. మంత్రి రోజా పేరు చెబితేనే చాలామందిలో ఒక రకమైన ఊపు వస్తుంది. ఎనర్జీకి చిరునామా మంత్రి రోజా. తన ఎనర్జీకి ఫిదా కాని వాళ్లు ఉండరు. ఇక తను స్టెప్పులేయడం మొదలు పెడితే తన కంటే బాగా ఎవ్వరూ వేయలేరు. బుల్లితెర మీద కూడా తనకు తిరుగులేదు అని నిరూపించుకున్నారు రోజా.

తాజాగా ఏపీలో నేషనల్ చాంపియన్ షిప్ డ్యాన్స్ పోటీలు జరిగాయి. ఆ పోటీలకు మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్ పాటలకు పలువురు పోటీదారులు డ్యాన్స్ లు వేసి అదరగొట్టేశారు. ముఖ్యంగా ఓ యువతి వేసిన డ్యాన్స్ చూసి మంత్రి రోజా తట్టుకోలేకపోయారు. తన డ్యాన్స్ కు ఫిదా అయిపోయారు. అందుకే చైర్ లో కూర్చొనే ఆ యువతి వేసిన డ్యాన్స్ కు మద్దతు ఇస్తున్నట్టుగా తను కూడా డ్యాన్స్ వేసి అదరగొట్టేశారు.

Minister Roja participates in dance championship program

Minister Roja participates in dance championship program

Minister Roja : అందరికీ కంగ్రాట్స్ చెప్పిన రోజా

ఈ సందర్భంగా మంత్ర రోజా మాట్లాడుతూ.. డ్యాన్స్ అనేది ఒక కళ అని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ దాగి ఉంటుందని.. అలాగే డ్యాన్స్ అనేది కూడా మంచి కళ అని చెప్పుకొచ్చారు. ఏపీ డ్యాన్స్ స్పోర్ట్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే.. మంత్రి రోజా అక్కడికి అతిథిగా వెళ్లి అందరు డ్యాన్స్ చేసిన వాళ్లకు ప్రోత్సహించడం, అభినందించడంతో అక్కడికి వచ్చిన వాళ్లు అందరూ మంత్రి రోజా మాటలకు ఫిదా అయిపోయారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp