Minister Roja : కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వెళ్ళిన రోజా.. వీడియో వైరల్..!!
Minister Roja : సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి రోజా.. రాష్ట్రవ్యాప్తంగా తన పదవికి న్యాయం చేస్తున్నారు. విద్యార్థులలో ఉండే టాలెంట్ బయటకు తీసి.. సరైన రీతిలో ఆటల పోటీలు నిర్వహిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. పర్యాటక శాఖ మంత్రిగా కూడా రాష్ట్రవ్యాప్తంగా కొత్త కొత్త ప్రదేశాలలో సరికొత్త అందాలను పర్యాటక ప్రేమికులకు పరిచయం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందడుగులు వేస్తున్నారు.
Minister Roja Unexpected Incident While Playing Kabaddi
ఏ రీతిగానే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మంత్రి రోజా విద్యార్థులతో కలసి కబడ్డీ ఆడారు. మేటర్ లోకి వెళ్తే ఎస్విఎం ప్రసాద్ స్మారక మహిళా కబాడీ పోటీల ముగింపుకు ముఖ్యఅతిథిగా మంత్రి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, సామినేని విమలాబాను మరియు మంత్రి ఆర్కే రోజా విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడటం జరిగింది. ఆటలో భాగంగా మంత్రి రోజా కూతకు వెళ్లి ప్రత్యర్థులను చెడుగుడు ఆడేసుకున్నారు.
Minister Roja Unexpected Incident While Playing Kabaddi
చాలా దూకుడుగా రోజా ఆడటంతో అక్కడున్న వారంతా జోష్ లో నిలిచిపోయారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ మహిళలంటే వంటింటికి కుందేళ్లు కాదన్నారు. ఒక్కసారి మహిళలకు అవకాశాలు వస్తే అద్భుతాలు సృష్టిస్తారు ఆకాశంలో దూసుకుపోతారు అని తెలియజేశారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మహిళా పక్షపాతని ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం పోటీలో విజేతలకు మంత్రి రోజా బహుమతులు అందజేయడం జరిగింది.
