Mohan Babu : చిరంజీవి నాకు ఫోన్ చేసి అలా అనడం నాకు మోహన్ బాబు.. ఏ విషయంలోనంటే?
Mohan Babu : టాలీవుడ్‌లో ఆప్త మిత్రులుగా పేరున్న నటులు చిరంజీవి, మోహన్‌బాబు. చాలా సార్లు వారు వేదికపై ఒకరిని మరొకరు పొగుడుకోవడం మనం చూడొచ్చు. అయితే, ఇటీవల కాలంలో తన ఆప్తమిత్రుడు చిరంజీవి చేసిన ఆ వ్యాఖ్యలు తనను బాధించాయని ఇన్‌డైరెక్ట్‌గా ఓ షో లో చెప్పారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు.‘మా’ ఎన్నికలు ముగిసిన తర్వాత మంచు విష్ణు మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ ప్రకటన చేశారు. తనను మెగాస్టార్ చిరంజీవి పోటీ నుంచి తప్పుకోవాలన్నారని పేర్కొన్నారు.
ఇకపోతే ఈ విషయమై నటుడు మోహన్ బాబు ఇన్ డైరెక్ట్‌గా ‘ఆలీతో సరదాగా’ షోలో ప్రస్తావించారు. ఆలీతో సరదాగా మాట్లాడుతూ మోహన్ బాబు ఈ విషయం గురించి మాట్లాడారు. తన అబ్బాయి ఒకదాని కోసం పోటీ చేస్తున్న సందర్భంలో ఆప్తమిత్రుడు ఒకతను ఫోన్ చేసి పోటీ నుంచి తప్పుకోవాలన్నారని, తాను ఎందుకని ప్రశ్నించగా మాటిచ్చాననే జవాబు అవతల నుంచి వచ్చిందని చెప్పాడు. అవతల వారు తమ కుటుంబ సభ్యులు పోటీలో లేకపోయినా తన కొడుకును పోటీ నుంచి తప్పుకోవాలనడం బాధాకరమని మోహన్ బాబు తెలిపాడు.
Mohan Babu : ఆ వ్యాఖ్యలు చేసినా చిరంజీవి ఆప్తమిత్రుడేనన్న మోహన్ బాబు..
అయితే, అతను అలా అన్నప్పటికీ తన ఆత్మీయ మిత్రుడేనని మోహన్ బాబు పేర్కొనడం గమనార్హం. మోహన్ బాబు చెప్పిన దాని ప్రకారం.. అవతల ఫోన్ చేసిన వ్యక్తి చిరంజీవి అని తేటతెల్లం అయిందని స్పష్టమవుతోంది. ఇకపోతే ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయినప్పటికీ ప్రకాశ్ రాజ్ సిని‘మా’ బిడ్డలం ప్యానెల్ నుంచి 11 మంది గెలుపొందారు. వారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ సంక్షేమం కోసం తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.