Mohan Babu : విష్ణు వ‌ద్ద‌న్నా కూడా త‌న సినిమాలో ముద్దు సీన్స్ పెట్టిన మోహ‌న్ బాబు

Authored By Sam C | The Telugu News | Published on: February 14, 2022, 6:30 pm

Mohan Babu: కలెక్ష‌న్ కింగ్ మోహన్‌బాబు త‌న త‌న‌యుల‌తో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తున్నాడు. ఆయ‌న హీరోగా నటించిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా. ఈ చిత్రానికి డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనా, ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రీకాంత్‌, అలీ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నిర్మాత మంచు విష్ణు. అయితే ఈ మూవీకి స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఇళయరాజా సంగీతమందించారు. ఈ నెల 18న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది ఈ చిత్రం. ఇందులో భాగంగా మోహ‌న్ బాబు సినిమాకి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటున్నాడు.

‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీని ముందుగా ఓటీటీ కోస‌మ‌ని రూపొందించాం. కంటెంట్ డిమాండ్ మేర‌కు ఇందులో అమ్మాయిల మ‌ధ్య ముద్దు సీన్లు ఉంటాయి. మ‌న‌కు సోసైటీలో మంచి పేరుంది. విద్యా సంస్థ‌లు న‌డుపుతున్నామంటూ దానికి విష్ణు ఒప్పుకోలేదు. క‌థ డిమాండ్ చేసింది కాబ‌ట్టే ఆ సీన్స్‌ను ఓకే చేశాం. చేయ‌ని త‌ప్పుకు జైలు వెళ్లే వ్య‌క్తి .. అతని కుటుంబం ప‌డే బాధ‌లు అనే పాయింట్‌తో సినిమా ఉంటుంది అని మోహ‌న్ బాబు అన్నారు.24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌తో కలసి విష్ణు మంచు నిర్మించిన ఈ సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇందులో ‘ప్రపంచమంతా నా కుటుంబం..

Mohan Babu who also k Scene Vishnu in movie

Mohan Babu who also k Scene Vishnu in movie

Mohan Babu : ముద్దు సీన్స్ సినిమాకి బ‌లం..

ప్రపంచం బాధే నా బాధ, స్వామీ.. ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.. నేను దాన్నే ఫాలో అవుతున్నా (మోహన్‌బాబు) పోరాటంలో అతని వెనుక ఇండియానే ఉంది (తనికెళ్ల భరణి), నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం నీతో పాటు 138 కోట్ల ఇండియన్స్‌కి చాలా డీటైయిల్డ్‌గా చెబుతాను’ (మోహన్‌బాబు) అనే డైలాగ్స్‌తో ట్రైలర్ ఆస‌క్తిని రేకెత్తించింది. మోహన్‌బాబు హీరోగా నటించడంతో పాటు అదనంగా స్క్రీన్‌ప్లే బాధ్యతను నిర్వర్తించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, ప్రగ్యా జైస్వాల్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించ‌డం విశేషం.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp