Monalisa : వామ్మో నువ్వేనా..? పూస‌ల‌మ్మే మోనాలిసా ఇప్పుడు కోటి రూపాయల కారులో… వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Monalisa : వామ్మో నువ్వేనా..? పూస‌ల‌మ్మే మోనాలిసా ఇప్పుడు కోటి రూపాయల కారులో… వీడియో..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Monalisa : వామ్మో నువ్వేనా..? పూస‌ల‌మ్మే మోనాలిసా ఇప్పుడు కోటి రూపాయల కారులో... వీడియో..!

Monalisa : కొన్ని నెలల క్రితం జరిగిన కుంభమేళాలో పూసలు అమ్మకుంటూ కనిపించిన వైరల్ గర్ల్ మోనాలిసా తన చేప కనులు, డస్కీ స్కిన్‌తో అందరినీ కట్టిపడేసింది. ఇప్పుడు కోటి రూపాయల విలువైన లగ్జరీ కారులో కనిపించి మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు.

Monalisa వామ్మో నువ్వేనా పూస‌ల‌మ్మే మోనాలిసా ఇప్పుడు కోటి రూపాయల కారులో వీడియో

Monalisa : వామ్మో నువ్వేనా..? పూస‌ల‌మ్మే మోనాలిసా ఇప్పుడు కోటి రూపాయల కారులో… వీడియో..!

Monalisa : ఓవ‌ర్‌నైట్ స్టార్..

మధ్యప్రదేశ్‌ కు చెందిన 16 ఏళ్ల మోనాలిసా భోంస్లే జీవితం ఒక్క రాత్రిలో మారిపోయింది. కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకునే ఆమె, ఒకే ఒక్క వీడియోతో స్టార్‌గా ఎదిగింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఆమె జీవితం లగ్జరీగా మారిపోయింది. అప్పటి వరకు రూ.100 కోసం కష్టపడ్డ మోనాలిసా ఇప్పుడు రూ.1 కోటి కారులో తిరుగుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు.

సింగర్ ఉత్కర్ష్ శర్మ తన మ్యూజిక్ వీడియోలో అవకాశం ఇవ్వడంతో ఆమె దశ తిరిగింది. ముఖ్యంగా ఆమె ఫోటో చూసే ఆయన ఈ అవకాశం ఇచ్చారు. మ్యూజిక్ వీడియో “సాద్గీ”కి సరిగ్గా సరిపోతుందని భావించాడు. మోనాలిసాకు కూడా పాట వినిపించాడు. ఆమెకు కూడా నచ్చగా.. వెంటనే ఓకే చెప్పింది. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు మద్దతు తెలపగా.. ఆమె తొలిసారి కెమెరా ముందుకు వచ్చి నటించడం ప్రారంభించింది. లోలోపల భయపడుతూనే.. డ్యాన్స్, నటన నేర్చుకుని మరీ ఈ వీడియో సాంగ్ చేసింది. జూన్ 14వ తేదీనే ఈ వీడియో విడుదల కాగా.. మంచి స్పందన వస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది