Monalisa : మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ .. మోనాలిసా ప్రేమ పెళ్లి పై బిగ్ ట్విస్ట్ .. !

 Authored By sudheer | The Telugu News | Updated on :10 April 2026,12:00 pm

ప్రధానాంశాలు:

  •  MonaLisa : మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ .. మోనాలిసా ప్రేమ పెళ్లి పై బిగ్ ట్విస్ట్ .. !

Monalisa : ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాలో తన తేనె కళ్లతో ఆకట్టుకుని ఒక్క రోజులోనే సోషల్ మీడియాలో స్టార్‌గా మారిన పూసలు అమ్ముకునే యువతి మోనాలిసా కథ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఫోటోలు, వీడియోలతో వైరల్ అయిన ఆమె జీవితం తాజాగా వివాదాల కేంద్రంగా మారింది. ప్రేమించి వివాహం చేసుకున్న కొద్ది రోజులకే ఆమె వయస్సు వివాహ చట్టబద్ధతపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

Big twist on Monalisa love marriage ..!

Big twist on Monalisa love marriage ..!

MonaLisa : మైనర్ అని తేల్చిన విచారణ

మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె మైనర్ అనే ఆరోపణలపై National Commission for Scheduled Tribes (NCST) (జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్) విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో, మోనాలిసా వయోజనురాలు కాదని, పార్ధి గిరిజన వర్గానికి చెందిన మైనర్ బాలిక అని నిర్ధారించారు. న్యాయవాది ప్రథమ్ దుబే ఈ అంశాన్ని కమిషన్ ముందు ప్రస్తావించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో మోనాలిసాను వివాహం చేసుకున్న ఫర్మాన్ ఖాన్‌పై మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది.

MonaLisa : నకిలీ పత్రాలతో వివాహం

దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు బయటపడ్డాయి. కేరళలో జరిగిన ఈ వివాహం నకిలీ జనన ధృవీకరణ పత్రాల ఆధారంగా నమోదు చేసినట్లు తేలింది. మహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా 2009 డిసెంబర్ 30న జన్మించింది. దీని ప్రకారం 2026 మార్చి 11న వివాహం జరిగినప్పుడు ఆమె వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. అయితే వివాహానికి ఉపయోగించిన పత్రాల్లో ఆమె పుట్టిన తేదీని 2008 జనవరి 1గా చూపించారు. దర్యాప్తు బృందం కేరళ నుంచి మధ్యప్రదేశ్ వరకు ఆధారాలు సేకరించి కేవలం 72 గంటల్లో అసలు నిజాన్ని వెలికితీసింది. ఈ నేపథ్యంలో తప్పుడు జనన ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

MonaLisa : కేసులో రాజకీయ, చట్టపరమైన కోణాలు

ఈ కేసు కేవలం వ్యక్తిగత ప్రేమ వివాహం కాదని కొన్ని సంస్థల ప్రమేయంపై కూడా ఆరోపణలు వినిపించాయి. విచారణలో కొన్ని రాజకీయ, మత సంస్థల పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో చట్టంతో పాటు బీఎన్ఎస్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి. బాధితురాలు షెడ్యూల్డ్ ట్రైబ్‌కు చెందినది కావడంతో కేసు మరింత సీరియస్ అయింది. ఇక కమిషన్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని 2026 ఏప్రిల్ 22న న్యూఢిల్లీలో విచారణకు హాజరుకావాలని సంబంధిత రాష్ట్రాల ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. ప్రతి మూడు రోజులకు ఒకసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మహాకుంభమేళాలో ఆకట్టుకున్న ఒక యువతి కథ ఇప్పుడు చట్టపరమైన వివాదంగా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో దోషులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి