Mouni Roy : న‌డి సంద్రంలో ముద్దులాట‌.. ఇదేం అరాచ‌కం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mouni Roy : న‌డి సంద్రంలో ముద్దులాట‌.. ఇదేం అరాచ‌కం..!

Mouni Roy : అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు రెచ్చిపోయి తెగ రొమాన్స్ చేస్తున్నారు. ‘నాగిని’ సీరియ‌ల్ ఫేం, బుల్లితెర న‌టి మౌనీరాయ్ ప్రియుడు, వ్యాపార‌వేత్త‌ సూర‌జ్ నంబియార్‌ను పెళ్లాడింది. జ‌న‌వ‌రి 27న‌ ఉద‌యం మ‌ల‌యాళీ సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో వీరి వివాహం జ‌రిగింది. ఈ వేడుక‌కు ఇరు కుటుంబాల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం హాజ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. పెళ్లి రోజు మౌనీరాయ్ తెలుపు రంగు ప‌ట్టుచీర‌లో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :10 August 2022,12:20 pm

Mouni Roy : అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు రెచ్చిపోయి తెగ రొమాన్స్ చేస్తున్నారు. ‘నాగిని’ సీరియ‌ల్ ఫేం, బుల్లితెర న‌టి మౌనీరాయ్ ప్రియుడు, వ్యాపార‌వేత్త‌ సూర‌జ్ నంబియార్‌ను పెళ్లాడింది. జ‌న‌వ‌రి 27న‌ ఉద‌యం మ‌ల‌యాళీ సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో వీరి వివాహం జ‌రిగింది. ఈ వేడుక‌కు ఇరు కుటుంబాల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం హాజ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. పెళ్లి రోజు మౌనీరాయ్ తెలుపు రంగు ప‌ట్టుచీర‌లో మెరిసిపోగా, సూర‌జ్ గోధుమ‌రంగు షేర్వాణీలో పెళ్లికొడుకుగా ముస్తాబ‌య్యాడు.

వారిద్ద‌రిని చూసి చూడ‌ముచ్చ‌టైన జంట అని నెటిజ‌న్స్ కామెంట్స్ పెట్టారు. 2004లోనే సినిమాల్లోకి వ‌చ్చినా నాగిన్ సిరియ్తో బాగా పేరు వ‌చ్చింది. టీవీషోలు, సీరియ‌ల్స్ లో సంద‌డి చేసింది. సినిమాల్లోనూ స‌త్తా చాటుతున్న‌ది. తుమ్ బిన్‌2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటం సాంగ్‌లో న‌టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది మౌనీరాయ్‌. బ్ర‌హ్మ‌స్త్ర‌, మొగుల్ సినిమాల్లో న‌టిస్తోంది. బాలీవుడ్‌లో రోమియో, అక్బర్ వాల్టర్, మేడ్ ఇన్ ఇండియా చిత్రాల్లో నటించారు. తన భర్త సూరజ్ నంబియార్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన రొమాంటిక్ ఫోటోలు వైరల్ అయ్యాయి.

mouni roy beautiful pics with husband

mouni roy beautiful pics with husband

Mouni Roy : భ‌ర్త‌తో ముద్దులాట‌…

భర్త సూరజ్ నంబియార్ బర్త్ డే సందర్భంగా మౌనీరాయ్ వెకేషన్‌లో రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పిక్స్ లో భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రు తెగ రెచ్చిపోతున్నారు. న‌డి సంద్రంలో ముద్దు ముచ్చ‌టలాడుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ప్ర‌స్తుతం వీరి పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మౌనీరాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకొంటారు. హ్యాపీ బర్త్ డే సూరజ్, నా జీవితానికి నీవే షైనింగ్ స్టార్. ప్రపంచంలో నీ మాదిరిగా ముద్దుల వర్షం కురిపించే వారు ఉండరు. నీతో గడిపే ప్రతీ క్షణం మధురానుభూతిని పంచుతుంది అని మౌనీ రాయ్ త‌న సోష‌ల్ మీడియాలో కామెంట్ చేసింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది