Mouni Roy : బ్రహ్మాస్త్ర విలన్ మౌనీ రాయ్ అందాల అరాచకం.. విప్పి వదిలేయడమే స్టైల్!
Mouni Roy : బాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బాస్టర్ బ్రహ్మాస్త్ర మూవీలో ప్రతినాయక పాత్రలో ఒదిగిపోయిన మౌనీ రాయ్ తన అందచందాలతో అరాచకం సృష్టిస్తోంది. చూసేందుకు స్లిమ్ అండ్ సింపుల్‌గా కనిపించే ఈ అమ్మడు అరాచకం ఇంతలా ఉంటుందని అభిమానులు కూడా ఊహించలేదని టాక్.సినిమాలో జీరో ఫిట్‌తో కనిపించే ఈ అసుర సుందరి.. అందుకు తగ్గట్టే అందాల ఆరబోయడంలోనూ ఒక అడుగు ముందే ఉంది.
Mouni Roy : బీచులో తేలియాడుతూ అందాల విందు
చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌లో ఒక సినిమాకు హిట్ టాక్ వచ్చింది. గత కొంతకాలంగా హిందీ సినిమాలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. సౌత్ సినిమాలు ఎప్పటి నుంచి హిందీలో ఆడటం ప్రారంభమైందో నాటి నుంచి బీటౌన్ స్టార్లకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. బాహుబలి -1,2..కేజీఎఫ్-1,2, పుష్ప, కార్తీకేయ-2 ఇలా ప్రతి సినిమా అక్కడి బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాయి.
ఇదే టైంలో బాయ్‌కాట్ బాలీవుడ్ మూవీస్ నినాదం హైలెట్ అయ్యింది. దీంతో అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా ఘోర పరాభవం పాలైంది. స్టోరీ పరంగా బాగుందని క్రిటిక్స్ రివ్యూస్ ఇచ్చినా.. ఆ సినిమాను బాయ్ కాట్ నినాదం సర్వనాశనం చేసింది. దాని సినిమా ఖర్చు కూడా 200కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఈ గ్యాప్‌లో హిందీ సినిమాలు ఫెయిల్యూర్ అవుతుండటంతో ఒక్కసారిగా బీటౌన్‌కు భయం పట్టుకుంది.
తాజాగా బ్రహ్మాస్త్ర సినిమా విజయవంతం కావడంతో బాలీవుడ్ దర్శకనిర్మాతలకు ఒక చిన్న హోప్ ఇచ్చినట్టు అయ్యింది. ఇక నుంచి హిందీలో తమ సినిమాలు హిట్ అవుతాయని నిర్మాతలు భావిస్తున్నారు. బాయ్ కాట్ నినాదం వలన జనాలు థియేటర్లకు రాకపోవడం ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ.. బ్రహ్మాస్త్ర సినిమా హిట్ అవ్వడంతో అందులో ప్రతినాయక పాత్ర చేసిన లేడి మౌనీ రాయ్.. తాజాగా తన ఒంటిపై ఉన్న దుస్తులను కప్పుకోరాని చోట కప్పుకుంటూ.. బటన్స్ విప్పి అందాలు ఆరబోసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.