Mufasa : మహేష్ బాబుకే కాదు ఆయన గొంతుకి యమ క్రేజ్.. ది లయన్ కింగ్ తొలి రోజు వసూళ్ల వర్షం
mufasa 1st day collection : హాలీవుడ్ Hollywood నిర్మాణ సంస్థ డిస్నీ disney నుంచి యానిమేషన్ సినిమా వస్తోందంటే ఆ సినిమా చూసేందుకు ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ చిత్రాలని పిల్లలతో పాటు పెద్దోళ్లు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తారు. ఇప్పుడు డిస్నీ సంస్థ నుంచి వచ్చిన కొత్త యానిమేటెడ్ మూవీ.. ముఫాసా: ది లయన్ కింగ్. రెండుసార్లు ఒకే కథతో ‘ది లయన్ కింగ్’ సినిమా తీసి అలరించిన డిస్నీ సంస్థ.. ఇప్పుడు దాని ప్రీక్వెల్ గా ‘ముఫాసా’ను తీర్చిదిద్దింది. తెలుగులో ప్రధాన పాత్రకు మహేష్ బాబు Mahesh Babu గాత్రదానం చేయడంతో ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయింది. “ది లయన్ కింగ్” the lion king చిత్రం సింబ కథతో మొదలవ్వగా.. “ముఫాసా” కథ సింబ తండ్రి ముఫాసా కథతో మొదలవుతుంది.
mufasa 1st day collection భారీ వసూళ్లు..
అసలు ముఫాసా ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? తన తల్లిదండ్రులకు దూరమయ్యి.. అనాథగా వేరే తెగ సింహాల చెంత పెరిగి.. ఒక రాజుగా ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో తనకంటే బలవంతుడైన కిరోస్ ను ఎలా ఎదిరించాడు? అందుకు టాకా సహాయపడ్డాడా? చివరికి వీళ్ళందరూ మిలేలేకి ఎలా చేరుకున్నారు? వీళ్లందరినీ రఫీకి ఎలా ఏకం చేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ముఫాసా” చిత్రం. ఓవరాల్ గా ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు వెర్షన్ వరకు 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. కేవలం తెలుగు వెర్షన్ లోనే కాదు, హిందీ తమిళం వెర్షన్స్ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ వచ్చినట్టు సమాచారం.
హిందీ లో ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని టాక్. నెగటివ్ టాక్ కి ఈ రేంజ్ అంటే, పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే ఈ చిత్రం కచ్చితంగా పాతిక కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కేవలం హిందీ నుండే వచ్చేదని విశ్లేషకుల మాటగా చెబుతున్నారు. మొదటి రోజు అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 25 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిందట. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ వెర్షన్ ని కూడా కలుపుకొని చూస్తే కచ్చితంగా మొదటిరోజు 500 కోట్ల రూపాయిల గ్రాస్ ఉంటుందని అంటున్నారు. ముఫాసా ది రైజ్‌గా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే.. మహేష్ బాబు ఈ సినిమా స్టార్ వాల్యూ తీసుకొచ్చారు. రెండున్నర గంటలపాటు ఫ్యామిలీ, పిల్లలు ఎంజాయ్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి. థియేట్రికల్ వాల్యూ ఉన్న సినిమా ఇది…