Chiranjeevi : ముగ్గురు మొనగాళ్ళు మూవీలో చిరుకి డూప్‌గా ఆ ఇద్దరు మొనగాళ్ళు వీరే…!

Authored By vamana sai | The Telugu News | Published on: July 19, 2021, 9:10 am

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ట్రిపుల్ రోల్ లో నటించిన సినిమా ముగ్గురు మొనగాళ్ళు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా ఇప్పటికీ బుల్లితెర మీద ఈ సినిమా వస్తే అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు. మూడు పాత్రల్లో మెగాస్టార్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఒక్కో పాత్రకి చాలా వేరియేషన్స్ ఉంటాయి. అయినా ఛాలెంజింగ్ గా తీసుకొని నటించారు. రోజా, నగ్మా, రమ్యకృష్ణ లాంటి స్టార్ హీరోయిన్స్ ఇందులో మెగాస్టార్ మూడు పాత్రలకి జంటగా నటించారు. చిరంజీవి కెరీర్ లో ముగ్గురు మొనగాళ్ళు చెప్పుకోదగ్గ సినిమాగా మిగిలింది.

mugguru monagallu movie dupes of chiranjeevi

mugguru monagallu movie dupes of chiranjeevi

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. అంతకముందు రాఘవేంద్ర రావు – చిరంజీవి కాంబినేషన్‌లో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘ఘరానా మొగుడు’, ‘రౌడీ అల్లుడు’ లాంటి వచ్చాయి. వీటి తర్వాత వచ్చిన ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1994 వ సంవత్సరం జనవరి 7వ తేదీన విడుదలైంది. మెగా బ్రదర్ నాగబాబు సొంత నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ లో ఈ సినిమాను నిర్మించారు. అయితే ఇందులో మెగాస్టార్ మూడు పాత్రల్లో సింగిల్ ఫ్రేం లో ఆయనే నటించవచ్చు.

Chiranjeevi : ఇద్దరు మొనగాళ్ళు సుబ్బారావు – హరిబాబు అని క్లారిటీ వచ్చేసింది.

mugguru monagallu movie dupes of chiranjeevi

mugguru monagallu movie dupes of chiranjeevi

కానీ ఒకేసారి ముగ్గురు ఒకే ఫ్రేం లో కనిపించినప్పుడు ఆయనకి డూప్స్‌గా నటించినవారెవరు అని సందేహం కలగక మానదు. చాలామందికి చిరంజీవి పోలికలతో ఉన్న రాజ్ కుమార్ ఒక పాత్రలో నటించాడని చెప్పుకున్నారు. కానీ అది నిజం కాదు. చిరంజీవి పర్సనల్ అసిస్టెంట్ సుబ్బారావు ఒకరుకాగా, మరొకరు ప్రముఖ నటుడు హరిబాబు నటించడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోని కూడా అప్పట్లో స్టిల్స్ తీసి బద్రపరచారు. ఇన్నేళ్ళకి ఆ ఫోటో బయటపడింది. దాంతో ముగ్గురు మొనగాళ్ళు సినిమాలో నటించిన మరో ఇద్దరు మొనగాళ్ళు సుబ్బారావు – హరిబాబు అని క్లారిటీ వచ్చేసింది.

ఇది కూడా చ‌ద‌వండి==> శేఖర్ మాస్టర్ కూడానా.. మరీ ఇంత దిగజారాలా.. వీడియో

ఇది కూడా చ‌ద‌వండి==> ఊపు ఊపేసిన యాంకర్ విష్ణు ప్రియ.. నాభి అందాలతో రచ్చ.. వీడియో వైరల్

ఇది కూడా చ‌ద‌వండి==> అమ్మా, నాన్నల మధ్య విభేదాలు.. ఎవ‌రికి పుట్టాలో అది నా చాయిస్ కాదు.. యాంకర్ రష్మి కన్నీటిపర్యంతం.. !

ఇది కూడా చ‌ద‌వండి==>  రష్మీతో సుధీర్ ఎన్నిసార్లు చేసినా బాగానే ఉంటుంది.. రోజా సెన్సేషనల్ కామెంట్స్

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp