Sekhar Master : శేఖర్ మాస్టర్ కూడానా.. మరీ ఇంత దిగజారాలా.. వీడియో
Sekhar Master : బుల్లితెరపై జడ్జ్‌లు, కమెడియన్స్, డ్యాన్సర్ అన్న తేడాలేమీ లేకుండా పోతున్నాయి. డ్యాన్సర్లు డ్యాన్సులు మానేసి కామెడీలు చేస్తున్నారు. కమెడియన్లు కామెడీ మానేసి డ్యాన్సులు చేస్తున్నారు. ఇక జడ్జ్‌లు ఎప్పుడు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. శేఖర్ మాస్టర్ ఒకప్పుడు జడ్జ్‌గా తన కంటూ మంచి పేరును సంపాదించుకున్నారు.
మధ్యలో కామెడీ యాంగిల్‌ను చూపించారు. అలా స్కిట్లలో కామెడీ చేస్తూ తనలోని నటనను అందరికీ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు కామెడీ స్టార్స్‌లో జడ్జ్‌గా శ్రీదేవీతో కలిసి హల్చల్ చేస్తున్నారు. ఇక ఇలాంటి షోలో ట్రాకులు క్రియేట్ చేసేందుకు మేకర్స్ బాగానే ప్రయత్నిస్తుంటారు. శ్రీదేవీ శేఖర్ మాస్టర్ మధ్య ఏదో ఉన్నట్టు మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు.
మరీ ఇంత దిగజారాలా?.. శేఖర్ మాస్టర్ కూడా అతీతుడు కాదేమో! Sekhar Master
అయితే తాజాగా అవినాష్ తన స్కిట్ కోసం శేఖర్ మాస్టర్, శ్రీదేవీని వాడేశాడు. పెళ్లికి ముందు పులిలా ఉన్నవాడు.. పెళ్లి తరువాత పెళ్లాం వచ్చిన తరువాత పిల్లిలా మారుతాడు. అని చెప్పేందుకు శేఖర్ మాస్టర్ చేత స్కిట్ వేయించినట్టున్నాడు అవినాష్. ఇందులో ఏకంగా శేఖర్ మాస్టర్ చేత చీపురు పట్టి ఊడిపించాడు. పైగా ఓ కొంగును కూడా శేఖర్ మాస్టర్ మీద కప్పేశారు. ఇలా శేఖర్ మాస్టర్ స్థాయిని తనకు తానే తగ్గించుకుంటున్నాడేమో.. ఈ బుల్లితెరపై ఎంతో మంది తమ పైత్యాలను చూపిస్తుండగా.. అందులో శేఖర్ మాస్టర్ కూడా అతీతుడు కాదేమోననిపిస్తోంది.
ఇది కూడా చదవండి ==> అమ్మా, నాన్నల మధ్య విభేదాలు.. ఎవరికి పుట్టాలో అది నా చాయిస్ కాదు.. యాంకర్ రష్మి కన్నీటిపర్యంతం.. !
ఇది కూడా చదవండి ==> రష్మీతో సుధీర్ ఎన్నిసార్లు చేసినా బాగానే ఉంటుంది.. రోజా సెన్సేషనల్ కామెంట్స్
ఇది కూడా చదవండి ==> సుమ, రాజీవ్ కనకాలని శాపనార్థాలు పెట్టిన నటి అన్నపూర్ణ..!
ఇది కూడా చదవండి ==> ‘మా ‘లో మళ్లీ గొడవలు… మా డబ్బును వృథా చేశారు.. బాలయ్య వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్..!