Roja : రష్మీతో సుధీర్ ఎన్నిసార్లు చేసినా బాగానే ఉంటుంది.. రోజా సెన్సేషనల్ కామెంట్స్
Roja : బుల్లితెరపై జబర్దస్త్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. జబర్దస్త్ ఆర్టిస్ట్‌లంటే అందరూ గుర్తు పడతారు. ఇక హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వంటి వారైతే స్టార్స్ అయిపోయారు. ఈ ఇద్దరూ జబర్దస్త్‌లోనే కాకుండా ఢీ షోలనూ సందడి చేస్తుంటారు. అక్కడ రష్మీ, దీపిక పిల్లిలలో కలిసి కామెడీ పండిస్తుంటారు. ఇక ఈ నలుగురు ఇప్పుడు జబర్దస్త్ వేదిక మీద స్కిట్ వేశారు. మొన్న ఆది తన టీంలో స్కిట్ వేసేందుకు ఢీ టీంను వాడుకున్నాడు.
Roja : సుధీర్ ఎన్నిసార్లు చేసినా బాగానే ఉంటుంది.. రోజా సెన్సేషనల్ కామెంట్స్
పెళ్లి వ్యవహారంతో ఓ స్కిట్ వేశాడు. రష్మీ సుధీర్, తనకు దీపికకు పెళ్లి జరిగినట్టుగా ఓ స్కిట్ వేశారు. ఆ స్కిట్ అంతా ఓ లెక్క అనుకుంటే చివర్లో రోజా వేసిన కామెంట్లు మరో లెక్క. ఇక స్కిట్లో ఎప్పటిలానే సుధీర్ రష్మీ తమ మధ్య ఉన్న కెమిస్ట్రీని బాగానే వాడుకున్నారు. చూసే వారికి ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఈ ఇద్దరూ స్కిట్‌ను లాగించేశారు. దీని మీదే రోజా కామెంట్ చేసింది.
మామూలుగా అయితే ఎవరైనా సరే.. ఒకే స్కిట్‌ను పదే పదే చేస్తుంటే చూడలేం. బోర్ కొడుతుంది. కానీ సుధీర్ ఎన్ని సార్లు ఇలాంటి స్కిట్ వేసినా, రష్మీతో పెళ్లి అంటూ స్కిట్ వేసినా కూడా చూడాలనిపిస్తుంది. రష్మీ కూడా అంతే చక్కగా నటిస్తుంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగుందని రోజా కామెంట్ చేశారు. మొత్తానికి ఇలా పెళ్లిళ్ల స్కిట్ల మీద నెటిజన్లు మాత్రం ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.
ఇది కూడా చదవండి ==> ‘మా ‘లో మళ్లీ గొడవలు… మా డబ్బును వృథా చేశారు.. బాలయ్య వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్..!
ఇది కూడా చదవండి ==> సుమ, రాజీవ్ కనకాలని శాపనార్థాలు పెట్టిన నటి అన్నపూర్ణ..!
ఇది కూడా చదవండి ==> యాంకర్ సుమ ఇళ్లు ఎంత లగ్జరీగా ఉందో తెలుసా?.. వీడియో వైరల్
ఇది కూడా చదవండి ==> ఎప్పుడూ తొక్కేస్తోంది.. సుమపై శ్రీముఖి అసహనం!