Mumaith khan : బిగ్ బాస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఫైర్ బ్రాండ్‌.. ఇక గేమ్ రంజుగా మార‌డం ఖాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mumaith khan : బిగ్ బాస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఫైర్ బ్రాండ్‌.. ఇక గేమ్ రంజుగా మార‌డం ఖాయం..!

Mumaith Khan : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఐదు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో సందడిగా నడుస్తోంది. ఫలితంగా ఈ సీజన్ రోజురోజుకూ రసవత్తరంగా మారుతూ సాగిపోతోంది. నాన్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :1 April 2022,6:00 am

Mumaith Khan : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఐదు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో సందడిగా నడుస్తోంది. ఫలితంగా ఈ సీజన్ రోజురోజుకూ రసవత్తరంగా మారుతూ సాగిపోతోంది. నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు.

వీరిలో నుంచి ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయులు ఎలిమినేట్ అయిపోయారు.బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి ఫలానా సెలెబ్రిటీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే చాలా మంది ప్రముఖుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మరీ ముఖ్యంగా గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో అందరిలోనూ ఆసక్తి పెరుగుతూనే ఉంది. ముమైత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సర్‌ప్రైజ్ అంటూ ఓ పోస్ట్ చేయడంతో అంద‌రు ఆమె రీఎంట్రీ ఇస్తుంద‌ని అనుకున్నారు.

mumaith khan re entry into bigg boss house

mumaith khan re entry into bigg boss house

Mumaith Khan : భ‌లే ఎంట్రీ ఇచ్చిందిగా..

అన్న‌ట్టుగానే ముమైత్ రీఎంట్రీ ఇచ్చి షాకిచ్చింది.స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ కోర్టు టాస్క్‌లో భాగంగా జడ్జీగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. అఖిల్-బిందు మాధవిల మధ్య విడాకులు ఇష్యూ అంటూ ఏదో డ్రామా క్రియేట్ చేసి ఇద్దరి మధ్య ఫిటింగ్ పెట్టింది ముమైత్. ఈ డ్రామాలో యాంకర్ శివని వకీల్‌గా మార్చేశారు బిగ్ బాస్. మొత్తానికి ముమైత్ ఎంట్రీ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక హౌజ్ మ‌ళ్లీ ర‌ణ‌రంగంగా మార‌డం ఖాయం అని అంటున్నారు. అయితే ముమైత్‌కి బిగ్ బాస్ హౌజ్ అత్తారిల్లు అయిపోయిందిగా అంటూ కొంద‌రు కామెంట్స్ పెడుతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది