SS Taman : తెలుగు చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. ఒకప్పుడు దేవీ శ్రీ ప్రసాద్, మణిశర్మల పేర్లు ఇండస్ట్రీల మార్మోగేవి. ప్రస్తుతం వారి స్థానాన్ని థమన్ కబ్జా చేసేశాడు. బాలయ్య బాబు నటించిన అఖండ మూవీతో థమన్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.సౌత్ ఇండియాలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ పేరు వినిపిస్తోంది. అగ్రహీరోలకు వారి తనయుల సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్, కన్నడం, మాళయాలం చిత్రాలకు కూడా థమన్ సంగీతం అందిస్తుండటం గమనార్హం..
తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో థమన్ మంచి బ్రేక్ వచ్చింది. అందులోని ‘బుట్టబొమ్మ’ సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటను ఏకంగా బాలీవుడ్ ను కూడా షేక్ చేసింది.తెలుగు ఇండస్ట్రీలో థమన్ ప్రస్తుతం చాలా బిజీ అయిపోయారు. అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయని తెలిసింది. ఈ క్రమంలోనే థమన్ ‘అలీతో సరదాగా’ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా విచ్చేసి కాసేపు తన వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. తన కెరీర్‌లో ఎన్నో ప్లాపులు వచ్చాయని, ఆ టైంలో ఎప్పుడూ కుంగిపోలేదన్నారు. హిట్స్ వచ్చినా కూడా అలానే నిశ్చలంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. నిజానికి ప్లాపుల నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు.
తన ఫస్ట్ మూవీ బాలకృష్ణ హీరోగా నటించిన ‘భైరవద్వీపం’ అని చెప్పాడుథమన్.. అందులో డ్రమ్మర్‌గా పనిచేసినందుకు అప్పట్లో రూ.30 వేతనంగా ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు.ఇప్పుడు అదే బాలయ్య బాబు అఖండ సినిమాకు సంగీత దర్శకుడిగా చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. అఖండ మ్యూజిక్ అవుట్ పుట్ చూశాక ‘ఈ సినిమాకు నువ్వు కూడా హీరోవే’ అని బాలయ్య బాబు తనతో అన్నారని థమన్ చెప్పుకొచ్చారు. 30రూపాయల జీతం నుంచి తాను ఈ స్థాయికి చేరుకోవడానికి 20 సంవత్సరాలు పట్టిందని , దీని కోసం ఎంతో శ్రమించానని చెప్పాడు. తనకు ఇళయరాజా గుండె అయితే, ఏఆర్ రెహమాన్ బ్రెయిన్ అని థమన్ చెప్పడం విశేషం..
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.