Hansika Motwani : టాలీవుడ్ నటి హన్సిక మోత్వాని తెలుసు కదా. తనకు పెళ్లి అయినా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. తాజాగా తను మై నేమ్ ఈజ్ శృతి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ ఈవెంట్ లో మూవీ టీమ్ పాల్గొన్నది. మీడియా మీట్ నిర్వహించింది. ఈసందర్భంగా మరోసారి సురేశ్ కొండేటి రెచ్చిపోయాడు. హన్సికను ఇష్టం ఉన్నట్టుగా ప్రశ్నలు అడిగాడు. నీకు పెళ్లయింది కదా.. ఇంకా సినిమాలు చేస్తారా? అంటూ అడిగాడు. అలాగే.. నీ స్కిన్ ఎందుకు ఇంత ప్రకాశంగా ఉంది. మీరు పెళ్లయినా ఇంత అందంగా ఉన్నారు అంటే హన్సిక పొంగిపోయింది. వెంటనే ఐలవ్యూ అంటూ చెప్పేసింది హన్సిక. కానీ.. హన్సిక ఏదో మీడియా ముందు అలా మాట్లాడినట్టు తెలుస్తోంది. కానీ.. ఇన్ డైరెక్ట్ గా సురేశ్ కొండేటిని తిట్టినట్టుగా అనిపిస్తోంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు ఈ సినిమాకు మై నేమ్ ఈజ్ శృతి అని పేరెందుకు పెట్టారు అంటూ పిచ్చి ప్రశ్నలు అడిగాడు సురేశ్. దీంతో డైరెక్టర్ కు కోపం వచ్చింది. అడగాల్సిన ప్రశ్నలు కాకుండా సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నాడంటూ కోపం ప్రదర్శించాడు. నువ్వు ఇండస్ట్రీకి వచ్చి కూడా చాలా ఏళ్లు అవుతోంది. అయినా కూడా ఇంకా 16 ఏళ్ల పడుచు పిల్లలా కనిపిస్తున్నావు. నీ సీక్రెట్ ఏంటి.. ఇంత యంగ్ గా ఎలా ఉన్నావు అంటూ సురేశ్ ప్రశ్నించాడు. దీంతో ఐలవ్యూ. నన్ను పొగిడావు కదా అంటూ రివర్స్ పంచ్ ఇచ్చింది హన్సిక. నాకు పెళ్లి అయినా.. పెళ్లి కాకపోయినా.. తల్లిని అయినా ఏదైనా.. నేను నాకు ఏ క్యారెక్టర్ నచ్చితే ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా చేస్తాను అంటూ హన్సిక చెప్పుకొచ్చింది.
హన్సిక ఈ సినిమాను ఒప్పుకోవడానికి కారణం.. కథలో ఉన్న దమ్ము. ప్రతి రోజు చాలా మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ప్రతి నిమిషానికి ఇండియాలో 10 మంది అమ్మాయిలు ట్రాప్ అవుతున్నారు. వీళ్లంతా ఏమౌతున్నారు అనేదానికి చాలామంది దగ్గర ఉండే సమాధానాలు కొన్ని మాత్రమే. మనకు తెలియని కోణాలు చాలా ఉన్నాయి. అమ్మాయిలను స్కిన్ కోసం ఎత్తుకెళ్తున్నారు. దాని ఆధారంగానే ఈ సినిమాను తీశాను అని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.