Home » Food Recipes » Chepala Pulusu In Fish Curry Recipe In Telugu
Food Recipes

Fish Curry Recipe : ఏ చేపతో అయినా ఇలా పులుసు పెట్టారంటే గిన్నె ఊడ్చాలిసిందే…!!

Authored By
aruna
The Telugu News | Published on: November 4, 2023, 5:00 pm
Advertisement

Fish Curry Recipe ; ఈరోజు చేపల పులుసుని పర్ఫెక్ట్ గా ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం.. చాలా చాలా ఈజీ మెథడ్. పర్ఫెక్ట్ ట్రెడిషనల్ రెసిపీ కూడా ఏ చేపతో అయినా సరే ఈ మెథడ్ లో కనుక చేపల పులుసు చేస్తే పర్ఫెక్ట్ వస్తుందండి. చేపల పులుసుని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు : చేప ముక్కలు, ధనియాలు, మెంతులు, ఎల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం, ఉప్పు, కారం, నూనె, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి మొదలైనవి…

Advertisement

తయారీ విధానం : ఈ రెసిపీ లోకి నేను యూస్ చేస్తున్న చేప వచ్చేసి శీలావతి ఈ చేపని ఒకటి కంప్లీట్ గా తీసుకొని పీసెస్ లా కట్ చేయించిన తర్వాత తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి. దానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీస్పూన్ దాకా మెంతులు. వీటన్నిటిని కూడా వేసేసిన తర్వాత ఫైన్ గా పౌడర్ చేసుకోండి. పచ్చి ఎల్లిపాయలు వేసుకొని ముద్దలా ఫేస్టు చేసుకోవాలి. మసాలా ముద్దను తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న చేపల క్వాంటిటీకి 50 గ్రాముల చింతపండును తీసుకొని చింతపండు మునిగేటట్టుగా నీళ్ళు పోసేసి చింతపండు నానేంత వరకు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత చింతపండు పులుసు మొత్తాన్ని కూడా పిండుకుని తీసుకోవాలి. ఎంత వీలైతే అంత నీళ్లు వేసేసి తిప్పి అంత వచ్చేసే అంతవరకు కూడా బాగా పిండేసి చింతపండు రసాన్ని తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకోండి.

Fish Curry Recipe

Advertisement

అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి ఆడ్ చేసుకోండి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లో వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాన్ని తీసుకుని ఆ టమాటా ప్యూరిని కూడా వేసేసేయండి. ఒక టేబుల్ స్పూన్ దాక కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆయిల్ లో కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇలా గ్రేవీ లోంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి. మసాలా ఆయిల్ లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని వేసేసేయాలి. చింతపండు రసం వేసి కొద్దిసేపు పొంగు వచ్చేలాగా ఉడికించండి. వాటర్ యాడ్ చేసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఐదు నిమిషాల పాటు పులుసుని మరిగించండి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఒక్కసారి ఈ పులుసు టేస్ట్ చూసుకోండి. మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసేయండి. చేప ముక్కలు వేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా పులుసులోకి మునిగేటట్టుగా గరిటతో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే నిదానంగా ఉడికించాలి.తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని రెండూ లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని గిన్నెని గరిట పెట్టకుండా ఒకసారి కుదుపుకుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి దేనికి పక్కన పెట్టుకోవాలి. చేసిన రోజు కాకుండా మరుసటి రోజు తింటేనే టేస్ట్ బాగుంటుందని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు… అలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి