Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు .. అందుకే నాగ్ అశ్విన్ ఈ మాట చెప్పి తప్పించుకుంటున్నాడు..!

Authored By vamana sai | The Telugu News | Published on: February 17, 2021, 4:30 pm

Prabhas : ప్రభాస్ ప్రస్తుతం వరసగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. సాహో తర్వాత కమిటయిన రాధే శ్యాం ఇంకా ప్రీప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. సమ్మర్ కానుకగా జూలై 30 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ చేయాల్సిన సినిమా వైజయంతీ మూవీస్ లో నిర్మించే సినిమా. ఈ సినిమా వైజయంతీ మూవీస్ కి 50 వ సినిమా కాబట్టి దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాడు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్.

Nag ashwin says that prabhas fans are going to hurt

Nag ashwin says that prabhas fans are going to hurt

ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.సైన్ ఫిక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు ఈ సినిమాకి క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె నటిస్తోంది. కీలక పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించబోతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరిని అధికారకంగా కూడా ప్రకటించారు.

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ మీద కాస్త గుర్రుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి..?

ఇక మహానటి సినిమాకి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ని కూడా ఫైనల్ చేసుకున్నారు. కాని ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకి వస్తుందో మాత్రం క్లారిటీ లేదు. ఈ ప్రాజెక్ట్ కంటే తర్వాత అనౌన్స్ చేసిన సినిమాలు సలార్, ఆదిపురుష్ ఇప్పటికే సెట్స్ మీదకి వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ మీద కాస్త గుర్రుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఫ్యాన్స్ ని ఖుషీ చేసేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ పదిరోజుల్లో ఒక సర్‌ప్రైజ్ ఇస్తానంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. మరి ఆ సర్‌ప్రైజ్ ఏంటన్నది తెలియాలంటే ఆ పది రోజులు వేయిట్ చేయాల్సిందే.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp