Krishnam Raju : సీనియర్ రెబల్ స్టార్ తో యంగ్ రెబల్ స్టార్ .. ఫోటో వైరల్..!
Krishnam Raju – Prabhas : యంగ్ రెబల్ స్టార్ .. డార్లింగ్ ప్రభాస్ పెదనాన్న సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు తో కలిసి ఉన్న లేటెస్ట్ పిక్ ని సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేశాడు. ఈ పిక్ లో ప్రభాస్ – కృష్ణం రాజు ల లుక్ చూస్తుంటే 1970 లో రెబల్ హీరోలు ఎలా ఉంటారో అలా ఉంది. ఇవే కామెంట్స్ ఈ లేటెస్ట్ పిక్స్ కి కూడా వస్తున్నాయి. ఇక చాలాకాలం తర్వాత ఇద్దరు రెబల్ స్టార్స్ ని చూస్తే అభిమానులకి రెండు కళ్ళు చాలటం లేదంటున్నారు. ఇంతకాలం ఇదే మిస్ అయ్యాయమని చెప్పుకుంటున్నారు.

Krishnam Raju thrills Prabhas stylish pic VIral
Krishnam Raju – Prabhas : రాధే శ్యామ్ లో కృష్ణ రాజు ఎలాంటి పాత్రలో కనిపిస్తున్నారో క్లారిటీ లేదు.
అయితే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. అసలు కథ ముందుంది అంటున్నారు. అవును… ఈ లేటెస్ట్ పిక్ ప్రభాస్ – పూజా హెగ్డే నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ రాధే శ్యామ్ లోనిది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ సినిమాలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో కృష్ణం రాజు పాత్రకి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. కాగా ఇన్నాళ్ళు రాధే శ్యామ్ లో కృష్ణ రాజు ఎలాంటి పాత్రలో కనిపిస్తున్నారో క్లారిటీ లేదు. కాని ఈ లేటెస్ట్ పిక్ చూస్తుంటే తండ్రీ – కొడుకుల మధ్య ఫ్యాన్స్ కి పూనకాలొచ్చే సీన్స్ ఉంటాయనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది.