Niharika : హైదరాబాద్‌లో రేవ్ పార్టీ కలకలం రేపిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ పార్టీని పోలీసులు దాడులు చేసి భగ్నం చేశారు.రాడిసన్ బ్లూ హోటల్‌పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫుడింగ్ మింక్ అనే పబ్ పై అధికారులు దాడులు చేశారు. పార్టీలో డ్రగ్స్ వాడినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు. అయితే పార్టీలో డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. నిందితుల్లో ప్రముఖ ర్యాప్ సింగర్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా ఉన్నారు. ఇందులో 95 మంది పురుషులు, 39 మంది మహిళలు, యజమానులు కూడా ఉన్నారు.
నిహారిక పేరు ఈ ఇష్యూలో ఉండడంతో నాగబాబు స్పందించారు. ఇందుకు సంబంధించి నాగబాబు స్పందించారు. ఓ వీడియో విడుదల చేసిన నాగబాబు.. నిహారిక విషయంలో ఎలాంటి తప్పులేదని పోలీసులు చెప్పినట్టుగా తెలిపారు. అనవసర ప్రచారాలు చేయవద్దని కోరారు. ‘‘ గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్‌లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం.. నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటం. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపటం వల్ల పబ్ మీద పోలీసు యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంతా వరకు ఆమె క్లియర్.పోలీసులు ఇచ్చిన సమాచారం వరకు.. నిహారిక విషయంలో ఎలాంటి తప్పులేదని చెప్పారు.
సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అన్ వాంటెడ్ స్పెక్యులేషన్స్‌కు తావివ్వకూడదని నేను వీడియోను రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్‌గా ఉంది. దయచేసి అన్ వాంటెడ్ స్పెక్యులేషన్స్ వ్యాప్తి చేయవద్దని నా రిక్వెస్ట్’’ అని నాగబాబు వీడియోలో పేర్కొన్నారు.కాగా, ఈ డెకాయ్ ఆపరేషన్‌లో నార్త్, సెంట్రల్, వెస్ట్ జోన్ పోలీసులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పలు టీవీ ఛానల్స్ ప్రసారం చేస్తున్న వీడియోల్లో నిహారికని పదే పదే చూపించిన విషయం తెలిసిందే. నిహారిక పోలీస్ స్టేషన్‌లో విచారణ అనంతరం బయటకు వస్తున్న విజువల్స్ కూడా బయటకు వచ్చాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.