Naga Babu : గుండెపై నాగబాబు పేరును పచ్చబొట్టుగా.. కమెడియన్ చేసిన పనికి మెగా బ్రదర్ ఎమోషనల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Naga Babu : గుండెపై నాగబాబు పేరును పచ్చబొట్టుగా.. కమెడియన్ చేసిన పనికి మెగా బ్రదర్ ఎమోషనల్

Naga Babu : జబర్దస్త్ షోలో చేసిన వారందరికీ నాగబాబు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. మొదట్లో అయితే జబర్దస్త్ షో అంటే అంతా నాగబాబే అని అనుకునేవారు. ఆయనకు తెలియకుండా అక్కడేమీ జరగదు.. ఆయన అనుమతి లేనిదే ఎవ్వరూ అక్కడ అడుగుపెట్టరని అనుకునేవారు.అలా అందరికీ నాగబాబు అండగా ఉండేవాడు. రోజా ఉన్నా కూడా మొదట్లో అంత ఫేమస్ కాదు. అంత ఆధిపత్యాన్ని చాటే చోటు కూడా దొరకలేదు. అందుకు జబర్దస్త్ ఆర్టిస్టులంతా కూడా నాగబాబు విధేయులుగా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :29 June 2022,9:30 pm

Naga Babu : జబర్దస్త్ షోలో చేసిన వారందరికీ నాగబాబు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. మొదట్లో అయితే జబర్దస్త్ షో అంటే అంతా నాగబాబే అని అనుకునేవారు. ఆయనకు తెలియకుండా అక్కడేమీ జరగదు.. ఆయన అనుమతి లేనిదే ఎవ్వరూ అక్కడ అడుగుపెట్టరని అనుకునేవారు.అలా అందరికీ నాగబాబు అండగా ఉండేవాడు. రోజా ఉన్నా కూడా మొదట్లో అంత ఫేమస్ కాదు. అంత ఆధిపత్యాన్ని చాటే చోటు కూడా దొరకలేదు. అందుకు జబర్దస్త్ ఆర్టిస్టులంతా కూడా నాగబాబు విధేయులుగా ఉండేవారు. ఇక నాగబాబుతో సుధీర్, ఆది, గెటప్ శ్రీను, రాం ప్రసాద్ వంటి వారు మరింత క్లోజ్‌గా ఉండేవారు.

సుధీర్ అయితే డాడీ అంటూ తెగ సందడి చేసేవాడు. చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, అప్పారావు వంటి వారు ఎక్కువగా తమ ప్రేమను చూపించకపోయినా కూడా విధేయులుగా ఉండేవారు. అలా నాగబాబు కోసం ఏమైనా చేసేందుకు రెడీ అని చెప్పేవారు. కానీ తీరా నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లి.. అదిరింది అనే కొత్త షోను పెడితే.. సుధీర్, ఆది వంటి వారు హ్యాండ్ ఇచ్చారు. వారంతా అగ్రిమెంట్ల వల్ల రాలేకపోయారని టాక్ వచ్చింది. కానా నాగబాబు వెంట మాత్రం చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ వంటి వారు వచ్చేశారు. మరీ ముఖ్యంగా కిరాక్ ఆర్పీకి నాగబాబు అంటే మరీ పిచ్చి. తన కొత్త సినిమా ప్రారంభోత్సవానికి కూడా నాగబాబునే పిలిచాడు.

Naga Babu Tattoo On Kirak RP Heart Reveals in Party cheddham Pushpa

Naga Babu Tattoo On Kirak RP Heart Reveals in Party cheddham Pushpa

నాగబాబుకు చెప్పకుండా ఏ పని కూడా చేయడు. కానీ నాగబాబుకి తెలియకుండా కిరాక్ ఆర్పీ ఓ పని చేశాడు. అది తాజాగా బయటకు వచ్చింది. ఆ విషయాన్ని సుధీర్ స్టేజ్ మీద బయటపెట్టేశాడు. కిరాక్ ఆర్పీకి కొంచెం పిచ్చి అందుకే ఆ పేరు పెట్టుకున్నాడు అని సుధీర్ చెబుతాడు. ఎంత ప్రేమ అంటే.. ప్రేమిస్తే కూడా అదే రేంజ్‌లో ప్రేమిస్తాడు.. మీ పేరుని గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు.. అని కిరాక్ ఆర్పీ గురించి సుధీర్ చెప్పేశాడు. అలా చెప్పడంతో నాగబాబు ఆశ్చర్యపోయాడు. నాకు ఇంత వరకు చెప్పలేదు కదరా? అని అనేశాడు. కిరాక్ ఆర్పీ గుండెల మీద తన పేరు చూసుకుని ఎమోషనల్ అయ్యాడు నాగబాబు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది