Samantha : సమంత కొరియా నుండి వచ్చాక నాగ చైతన్యను కలువనుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : సమంత కొరియా నుండి వచ్చాక నాగ చైతన్యను కలువనుందా?

 Authored By prabhas | The Telugu News | Updated on :4 December 2022,3:00 pm

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయో సైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇండియా తో పాటు పలు దేశాల్లో ఈ వ్యాధికి చికిత్స తీసుకున్న సమంత ప్రస్తుతం కొరియాలో ఉంది. అక్కడ ఈ వ్యాధి కి చికిత్స అద్భుతంగా ఉందంటూ సమాచారం అందడం తో సహితులతో కలిసి అక్కడికి వెళ్లిందట. సమంత మేనేజర్ అధికారికంగా కొరియా కు చికిత్స నిమిత్తం వెళ్తున్నట్లుగా తెలియజేశాడు. దాదాపు రెండు వారాల పాటు సమంత అక్కడ ఉంటుంది అనే ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ఎన్ని రోజులు అనే విషయమై క్లారిటీ లేదు.

ఈ సమయంలోనే కొరియా నుండి సమంత ఇండియా కు తిరిగి వచ్చిన వెంటనే నాగ చైతన్య ను కలవబోతుంది అనే వార్తలొస్తున్నాయి. ఆ మధ్య నాగచైతన్య ను సమంత కలిసే అవకాశాలు ఉన్నాయని ఇద్దరి మధ్య ఏదో విషయమై చర్చ జరగబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయం లో ఇద్దరు కలవలేదు. ఇప్పుడు చికిత్స నిమిత్తం నాగ చైతన్య సమంత కొరియా వెళ్లింది. ఆమె అక్కడ నుంచి వచ్చిన వెంటనే నాగ చైతన్య వెళ్లి కలవాలని భావిస్తున్నాడట. ఆ విషయాన్ని సమంత మేనేజర్ కి కూడా చెప్పాడని.. సమంత ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతుంది.

naga chaitanya and Samantha meeting very soon

naga chaitanya and Samantha meeting very soon

ఇప్పటి వరకు వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని క్లారిటీ లేదు కనుక వీరు ఏం మాట్లాడబోతున్నారు అనేది స్పష్టత రావాల్సి ఉంది. అసలు వీళ్ళు కలుస్తారా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. విడాకులకు సంబంధించిన వ్యవహారం మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకుంటారు. కానీ ఇద్దరు డైరెక్ట్ గా కలుసుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే మాదిరిగా ఈసారి కూడా సమంత నాగ చైతన్య కలవబోతున్నారు అనే వార్తలు పుకార్లు అయ్యి ఉండవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలంటే మరో రెండు వారాలు వెయిట్ చేయాల్సిందే.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి