Naga Chaitanya: కట్టెల పొయ్యిపై రుచికరమైన చేపల పులుసు వండిన నాగ చైతన్య.. రుచి అదిరింది..!
ప్రధానాంశాలు:
Naga Chaitanya: కట్టెల పొయ్యిపై రుచికరమైన చేపల పులుసు వండిన నాగ చైతన్య.. రుచి అదిరింది..!
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ఈ మధ్య తన రెండో పెళ్లితో ఎక్కువగా వార్తలలో నిలిచాడు. అయితే ఇప్పుడు తను స్వయంగా చేసిన చేపల పులుసు కర్రీతో హాట్ టాపిక్ అయ్యాడు. నాగ చైతన్య Akkineni Naga Chaitanya హీరోగా రూపొందుతున్న తాజా సినిమా ‘తండేల్ Thandel . ఇందులో సముద్రంలో చేపల వేటకు వెళ్లే శ్రీకాకుళం యువకుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. ఇప్పటికే రెండు పాటలు.. ‘బుజ్జితల్లి కాస్త నవ్వవే’, ‘నమో నమో నమః శివాయ’ లను విడుదల చేసింది…..

Naga Chaitanya: కట్టెల పొయ్యిపై రుచికరమైన చేపల పులుసు వండిన నాగ చైతన్య.. రుచి అదిరింది..!
Naga Chaitanya: స్వయంపాకం..
చైతూ Chaitu చిత్రంలో మత్స్య కారుడి పాత్ర పోషించగా, ఇప్పుడు మత్స్యకారుని పాత్ర కోసం బాగానే కష్టపడ్డాడు. సాధారణంగా మత్స్యకారుడి పాత్ర చేయడం మాత్రమే కాదు… ఆ పాత్రలో అక్కినేని నాగ చైతన్య జీవించారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ సినిమా కోసం ఆయన శ్రీకాకుళం యాస నేర్చుకున్నారు. అంతే కాదు… విశాఖలో ‘తండేల్’ సినిమా షూటింగ్ జరిగిన సమయంలో… అక్కడ స్థానిక ప్రజల కోసం తన చేతులతో స్వయంగా చేపల పులుసు వండి వడ్డించారు చైతన్య. ఆ వీడియో విడుదల చేసింది సినిమా యూనిట్. చేప ముక్కలకు ఉప్పు, పసుపు, అల్లం రాయడం మాత్రమే కాదు… పిల్లల పొయ్యి మీద స్వయంగా వంట చేసి పెట్టారు చైతన్య. తొలిసారి తాను చేపల పులుసు వండానని, ఒకవేళ పులుసు బాలేకపోతే ఏమీ అనుకోవద్దు అంటూ వినయంగా చెప్పడం విశేషం.
యేటలో చేపలు పట్టేసాక.. మంచి పులుసు ఎట్టేయాలి కదా.. తండేల్ రాజా ఆకా యువ సామ్రాట్ నాగ చైతన్య తండేల్ షూటింగ్‌లో స్థానికుల కోసం నోరూరించే చేపల పులుసు వండారు.” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.చైతు చేసిన చేపల కూర ఎంతో రుచికరంగా ఉందని స్థానిక మత్స్యకారులు చెప్పారు. తండేల్ మూవీ విజయం సాధించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సినిమాతో అయిన చైతూ మంచి హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు Akkineni Fans భావిస్తున్నారు.
#NagaChaitanya SHOCKINGLY Prepared a FISH CURRY For the Crew Great Gesture #Thandel 😳😳😳😳😳
— GetsCinema (@GetsCinema) January 17, 2025