Naga Chaitanya – Samantha : నాగ చైత‌న్య‌, స‌మంత క‌ల‌వ‌బోతున్నారా.. ఇండ‌స్ట్రీలో ఇదే చ‌ర్చ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naga Chaitanya – Samantha : నాగ చైత‌న్య‌, స‌మంత క‌ల‌వ‌బోతున్నారా.. ఇండ‌స్ట్రీలో ఇదే చ‌ర్చ‌

 Authored By ramu | The Telugu News | Updated on :15 June 2025,4:00 pm

Naga Chaitanya – Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని- నాగ చైత‌న్య జంట కొన్నాళ్ల‌కి విడిపోయిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుండి క‌లిసింది లేదు. అయితే ఇప్పుడు ఈ జంట కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఏ మాయ చేశావే. 2010లో విడుదలైన ఈ చిత్రం యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవ‌డ‌మే కాకుండా.. నాగ చైతన్యకు లవర్ బాయ్ ఇమేజ్‌ని తీసుకొచ్చింది.

Naga Chaitanya – Samantha : క‌లుస్తారా..

అలాగే సమంతను హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేసింది. ఈ సినిమా వ‌చ్చి 15 ఏండ్లు అవుతున్న సంద‌ర్భంగా మేక‌ర్స్ రీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 18న రీ-రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం చై- సామ్ తిరిగి క‌లిసే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. ఎందుకంటే ఈ చిత్రంతోనే స‌మంత క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసింది. ఈ ఇద్ద‌రూ ఇలాంటి ఒక గొప్ప సంద‌ర్భం కోసం క‌లిసి రావాలి.

Naga Chaitanya Samantha నాగ చైత‌న్య‌ స‌మంత క‌ల‌వ‌బోతున్నారా ఇండ‌స్ట్రీలో ఇదే చ‌ర్చ‌

Naga Chaitanya – Samantha : నాగ చైత‌న్య‌, స‌మంత క‌ల‌వ‌బోతున్నారా.. ఇండ‌స్ట్రీలో ఇదే చ‌ర్చ‌

ఏమాయ చేసావే సినిమాని ప్ర‌మోట్ చేయాలి. కానీ అది జ‌రుగుతుందా? అంటే చెప్ప‌లేం. ఇద్దరూ కలిసి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తే చాలా బాగుంటుందని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. చైతూ వేరొక‌రిని పెళ్లాడి సెటిల‌య్యాడు. ఇప్పుడు స‌మంతపైనా ర‌క‌ర‌కాల‌ రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. మ‌రి ఏ మాయ చేశావో క‌సం ఇద్ద‌రు క‌లిస్తే బాగుంటుంద‌ని చాలా మంది కోరుకుంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది