Naga Chaitanya : ఈ విషయం మీకు తెలుసా.. అఖిల్ కాకుండా నాగచైతన్యకు మరో తమ్ముడు.. ఎక్కడున్నాడంటే?
Naga Chaitanya : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య సమంత నుంచి డైవోర్స్ తీసుకున్న తర్వాత ప్రొఫెషనల్ కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టేశాడు. వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. మంగళవారం నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఆయనకు అక్కినేని అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ‘బంగార్రాజు’ చిత్రం నుంచి ఆయన ఫస్ట్ లుక్ ప్లస్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వాటిలో నాగచైతన్య మోస్ట్ స్టైలిష్‌గా కనబడుతున్నాడు. ఈ సంగతులు అలా ఉంచితే..నాగచైతన్యకు అఖిల్ కాకుండా మరో బ్రదర్ ఉన్నాడన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. అతనెవరో తెలుసుకుందాం.
Naga Chaitanya : తమ్ముడి మ్యారేజ్‌కు వెళ్లిన అక్కినేని నాగచైతన్య..

naga chaitanya do you know brother of hero naga chaitanya
రామానాయుడు కూతురు అయిన లక్ష్మి-నాగార్జునల సంతానం నాగచైతన్య. మనస్పర్థల కారణంగా నాగార్జున, లక్ష్మిలు విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున అమలను మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి కలిగిన సంతానమే అఖిల్. అలా నాగచైతన్యకు తమ్ముడు అఖిల్ ఉన్నాడన్న సంగతి దాదాపుగా అందరికీ విదితమే. కానీ, అఖిల్ కాకుండా నాగచైతన్యకు మరో తమ్ముడు ఉన్నాడు. ఎవరంటే..నాగచైతన్య తల్లి లక్ష్మి చెన్నై బిజినెస్ మ్యాన్ శరత్ విజయరాఘవన్‌ని మ్యారేజ్ చేసుకుంది. వీరి కుమారుడు కూడా నాగచైతన్యకు తమ్ముడే కదా.. కొన్నాళ్ల కిందట లక్ష్మీ తనయుడి మ్యారేజ్ జరగగా ఆ వేడుకకు నాగచైతన్య, సమంత వెళ్లొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరలయ్యాయి కూడా.
లక్ష్మి, శరత్ విజయరాఘవన్ దంపతులు చెన్నైలో ఉంటుండగా, వారి తనయుడు-కోడలు కూడా చెన్నైలో ఉంటున్నారు. అయితే, ఈ విషయం చాలా మందికి తెలియదు. మొత్తంగా నాగచైతన్యకు అఖిల్ మాత్రమే కాకుండా మరో సోదరుడు కూడా ఉన్నాడన్న సంగతి ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఇకపోతే తండ్రీ తనయుడు నాగార్జున-నాగచైతన్య ‘బంగార్రాజు’ చిత్రంలో నటిస్తున్నారు. కల్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ..‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్. ఇందులో నాగచైతన్యకు జోడీగా ‘నాగలక్ష్మి’గా ‘ఉప్పెన’ బ్యూటీ కృతిసనన్ నటిస్తుండగా, నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనున్నారు.