naga chaitanya funny comments on raashi khanna
Naga Chaitanya : ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది. సినిమాల పరంగా దూకుడుగా వెళ్లకుండా ఆచితూచి అడుగులేస్తూ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఈ అమ్మడు సరైన విజయాలు అందుకోలేకపోతుంది. రీసెంట్‌గా పక్కా కమర్షియల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశీ ఖన్నా త్వరలో థ్యాంక్యూ మూవీ చిత్రంతో పలకరించనుంది. ఇందులో నాగ చైతన్య కథానాయకుడిగా నటించాడు. చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో బిజీగా గడుపుతోంది చిత్ర యూనిట్.
అందులో భాగంగా నాగచైతన్యతో కలిసి ఓ వీడియో చిట్‌చాట్‌లో పాల్గొంది రాశీ ఖన్నా. ఇందులో నాగచైతన్య, రాశీఖన్నాలు ఒకరి గురించి ఒకరు యాంకర్ అడిగిన ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెప్పాలి. రాశీఖన్నా గురించి ఒకటి తప్ప అన్నీ కరెక్ట్ గా చెప్పాడు నాగచైతన్య. మరోవైపు ఆయన గురించి మాత్రం రాశీ అన్నీ నిజాలే చెప్పింది. ఇందులో భాగంగానే ఓ సంచలన విషయం, షాకింగ్ విషయం బయటపెట్టింది. తాజాగా తన డేటింగ్ కోరిక గురించి మాట్లాడుతూ.. తాను డేటింగ్ చేసేందుకు సిద్ధమే అని ఇప్పటికే చాలా సార్లు చెప్పిన ఈ బ్యూటీ.. తాజాగా అది ఎవరితో అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. తనకు ఓ డాక్టర్‌తో డేటింగ్ చేయాలని ఉందంటూ ఓపెన్ అయింది.
naga chaitanya funny comments on raashi khanna
తాను హీరోయిన్ కాకముందు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని అనుకుందట. స్కూల్‌లో తాను టాపర్ అని, బాగా చదువుతానని తెలిపింది. కానీ డేట్‌కి మాత్రం ఓ డాక్టర్‌తో వెళ్లాలనుకుంటున్నట్టు తెలిపింది. దీంతో నాగచైతన్య ఫన్నీగా స్పందించారు. డాక్టర్లందరూ ఇది వింటున్నారా? అందరు ఆసుపత్రి మానేసి రాశీ ఇంటి బయట వెయిట్ చేస్తారని చెప్పడం నవ్వులు పూయించింది. నాగచైతన్య ఫుడ్ నుంచి, కార్ల వరకు రాశీఖన్నా అన్నీ నిజాలే చెప్పడం విశేషం. ప్రస్తుతం రాశీ, నాగచైతన్య చిట్‌చాట్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్లో ఉండటం విశేషం. నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించిన `థ్యాంక్యూ` చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో రాశీతోపాటు మాళవిక మోహనన్, అవికా గోర్ హీరోయిన్లుగా చేస్తున్నారు.
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
This website uses cookies.