Naga Chaitanya : వారితో డేట్‌కి వెళ‌తాన‌న్న రాశీ ఖ‌న్నా.. షాకింగ్ కామెంట్ చేసిన నాగ చైత‌న్య‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naga Chaitanya : వారితో డేట్‌కి వెళ‌తాన‌న్న రాశీ ఖ‌న్నా.. షాకింగ్ కామెంట్ చేసిన నాగ చైత‌న్య‌

 Authored By sandeep | The Telugu News | Updated on :8 July 2022,10:00 pm

Naga Chaitanya : ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది. సినిమాల పరంగా దూకుడుగా వెళ్లకుండా ఆచితూచి అడుగులేస్తూ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సరిగ్గా ఉప‌యోగించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ప్ప‌టికీ ఈ అమ్మ‌డు స‌రైన విజ‌యాలు అందుకోలేక‌పోతుంది. రీసెంట్‌గా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రాశీ ఖ‌న్నా త్వ‌ర‌లో థ్యాంక్యూ మూవీ చిత్రంతో ప‌ల‌క‌రించ‌నుంది. ఇందులో నాగ చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టించాడు. చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేప‌థ్యంలో చిత్ర ప్రమోషన్‌లో బిజీగా గడుపుతోంది చిత్ర యూనిట్‌.

అందులో భాగంగా నాగచైతన్యతో కలిసి ఓ వీడియో చిట్‌చాట్‌లో పాల్గొంది రాశీ ఖ‌న్నా. ఇందులో నాగచైతన్య, రాశీఖన్నాలు ఒకరి గురించి ఒకరు యాంకర్‌ అడిగిన ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెప్పాలి. రాశీఖన్నా గురించి ఒకటి తప్ప అన్నీ కరెక్ట్ గా చెప్పాడు నాగచైతన్య. మరోవైపు ఆయన గురించి మాత్రం రాశీ అన్నీ నిజాలే చెప్పింది. ఇందులో భాగంగానే ఓ సంచలన విషయం, షాకింగ్‌ విషయం బయటపెట్టింది. తాజాగా తన డేటింగ్ కోరిక గురించి మాట్లాడుతూ.. తాను డేటింగ్‌ చేసేందుకు సిద్ధమే అని ఇప్పటికే చాలా సార్లు చెప్పిన ఈ బ్యూటీ.. తాజాగా అది ఎవరితో అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. తనకు ఓ డాక్టర్‌తో డేటింగ్ చేయాలని ఉందంటూ ఓపెన్ అయింది.

naga chaitanya funny comments on raashi khanna

naga chaitanya funny comments on raashi khanna

Naga Chaitanya : స్ట‌న్నింగ్ స‌మాధానం..

తాను హీరోయిన్‌ కాకముందు ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలని అనుకుందట. స్కూల్‌లో తాను టాపర్‌ అని, బాగా చదువుతానని తెలిపింది. కానీ డేట్‌కి మాత్రం ఓ డాక్టర్‌తో వెళ్లాలనుకుంటున్నట్టు తెలిపింది. దీంతో నాగచైతన్య ఫన్నీగా స్పందించారు. డాక్టర్లందరూ ఇది వింటున్నారా? అందరు ఆసుపత్రి మానేసి రాశీ ఇంటి బయట వెయిట్‌ చేస్తారని చెప్పడం నవ్వులు పూయించింది. నాగచైతన్య ఫుడ్‌ నుంచి, కార్ల వరకు రాశీఖన్నా అన్నీ నిజాలే చెప్పడం విశేషం. ప్రస్తుతం రాశీ, నాగచైతన్య చిట్‌చాట్‌ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్లో ఉండటం విశేషం. నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించిన `థ్యాంక్యూ` చిత్రానికి విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇందులో రాశీతోపాటు మాళవిక మోహనన్‌, అవికా గోర్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది