
Naga Chaitanya is very upset with Samantha behaviour
Naga Chaitanya – Samantha : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నారని తెలియగానే రెండు తెలుగురాష్ట్రాల్లోని మీడియా కోడై కూసింది. పొద్దున లేచినప్పటి నుంచి అదే టాపిక్ పై విభిన్న కథనాలను ప్రసారం చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పలేనన్ని ఊహాగానాలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ జంట విడాకులు తీసుకుని ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. వీరు విడిపోయి 10 నెలలు దాటిపోయింది. ఎవరి జీవితాల్లో వారు బిజీగా మారిపోయారు. కానీ ఇప్పటికీ వీరిద్దరు ఎందుకు విడాకులు తీసుకున్నారన్న విషయంపై నేటికీ ఎవరికీ క్లారిటీ లేదు. సామ్ చై కూడా తాము ఎందుకు విడిపోయామో క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేయలేదు. అయితే కాఫీ విత్ కరణ్ షో లో తన భర్త చైతన్యపై సామ్ సంచలన కామెంట్స్ చేసింది.
‘మేము విడాకులు తీసుకున్నాం. అదంతా ఈజీగా జరగలేదు. మా ఇద్దరి మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. కనీసం చైతన్య తనతో భర్త అని పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. మా ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే పదునైన ఆయుధాలు కూడా పెట్టాలి’అంటూ చెప్పింది. సమంత ఇలా హాట్ కామెంట్స్ చేశాక అందరూ చైతన్యదే తప్పు అనుకున్నారు. ఈ కారణం వల్లే అక్కినేని కుటుంబం నుంచి ఎవరూ పెద్దగా స్పందించలేదని అంతా భావించారు. అయితే, ఇటీవల జరిగిన లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్‌లో భాగంగా నాగచైతన్య ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. సామ్ గురించి ఆమెతో విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేశాడు.
Naga Chaitanya is very upset with Samantha behaviour
‘సామ్ అంటే ఇప్పటికీ ఇప్పటికీ నాకు అమితమైన గౌరవం ఉంది. మేం విడాకులు తీసుకున్నంత మాత్రానా అది పోదు. అందరికీ ముందే చెప్పాం. ఓ అండర్‌స్టాండింగ్‌తోనే మేము విడాకులు తీసుకున్నాం. అన్ని ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. మాకు ఒకరిపై మరోకరికి చాలా గౌరవం ఉంది’అని పేర్కొన్నాడు. మేము విడిపోయాక చాలా మంది పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు. అలాంటివి నేను పట్టించుకోను. అందుకే హ్యాపీగా ఉన్నాను. మొదట్లో ఇలాంటివి విన్నప్పుడు చాలా విసుగ్గా అనిపించింది అని చైతన్య చెప్పుకొచ్చాడు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.