
naga chaitanya life spoiled by nagarjuna
Naga Chaitanya : నాగ చైతన్య.. చూడ్డానికి చాల సౌమ్యంగా ఉంటారు. ఎలాంటి వివాదాలకు పోకుండా, కాంట్రవర్సీస్ క్రియేట్ చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోతాడు. సమంతని ప్రేమించి పెళ్లి చేసుకొని నాలుగేళ్ల పాటు ఎంతో హ్యాపీగా కనిపించాడు. కాని ఏమైందో ఏమో కాని ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అవి చివరకు విడాకుల వరకు వెళ్లాయి. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోయింది అనే చేదు నిజాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరూ తమ వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ జీవితాల్లో ముందుకు సాగిపోతున్నారు. తాజాగా కాఫీ విత్ కరణ్ షో కి గెస్ట్ గా వెళ్లిన సమంత విడాకుల గురించి ఓపెన్ అప్ అయింది.
విడాకులు తీసుకుంటున్నప్పుడు తాను చాలా బాధలో ఉన్నానని కానీ ఇప్పుడు కొంచెం పరవాలేదని చెప్పింది సమంత. “మీరు మీ భర్త విడిపోవాలి అనుకుంటున్నప్పుడు” అని హోస్ట్ కరణ్ జోహార్ ప్రశ్న అడుగుతుండగా సమంత అతనిని ఆపేసి భర్త కాదు మాజీ భర్త అని సీరియస్ గా చెప్పటం నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతేకాకుండా “మా ఇద్దరినీ ఒక గదిలో పెడితే పదునుగా ఉండే వస్తువులను దాచేయాలి” అంటూ ఘాటుగానే చెప్పుకొచ్చింది సామ్. అంటే వీరిద్దరు ఇప్పుడు బద్ధ శత్రువుల మాదిరిగా ఉన్నారా అనే అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగ చైతన్య జీవితం ఇలా కావడానికి పరోక్షంగా నాగార్జునే కారణం అని కొందరు అంటున్నారు.
naga chaitanya life spoiled by nagarjuna
దగ్గుబాటి ఫ్యామిలీ ఆడపడుచు లక్ష్మిని పెళ్ళి చేసుకున్న నాగార్జున ఆమె మనసు బాధపెట్టి ..కన్నీరు కు కారణమై హీరోయిన్ అమల ను రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆ నాడు నాగార్జున..లక్ష్మి ని వదిలేయకుండా ఉంటే..ఇద్దరు హ్యాపీ గా భార్య భర్తలుగా ఉంటు తల్లిదండ్రుల పెంపకంలో పెరిగేవాడు చైతన్య. అప్పుడు నాగ చైతన్య కి మంచి చెడు తెలిసొచ్చేది. విడాకుల వరకు వెళ్లకుండా తన జీవితాన్ని ఏదోలో సెట్ చేసుకునేవాడు. అఖిల్ ఓవర్ గారాభం వల్ల చెడిపోతే..నాగ చైతన్య అమ్మ నాన్న కలిసి చూపే ప్రేమకు దూరమై సమంత ను వదులుకున్నాడు. నాగ్- లక్ష్మీ పెంపకంలో చైతూ పెరిగి ఉంటే ఆయన జీవితం ఇలా అయి ఉండేది కాదని కొందరు తమ అభిప్రాయాలు వెళ్లబుచ్చుతున్నారు.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.