Naga Chaitanya : నాగ చైతన్య సినిమా అట్టర్ ఫ్లాప్.. కలెక్షన్స్ మాత్రం రికార్డ్స్ చెరిపేస్తుందిగా..!
Naga Chaitanya : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య కలిసి నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ఈ సినిమా రిలీజ్ రైట్స్ మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాగా, మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచింది. చిత్రం అట్లర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆమిర్ ఖాన్ ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇండియాలో దాదాపు రూ.60 కోట్లను మాత్రమే వసూలు చేసి ఆమిర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం నాగ చైతన్యను నిరాశపరచింది. ఇది అతనికి తొలి బాలీవుడ్ మూవీ కాగా, అంత దారుణంగా ఫ్లాప్ కావడం ఆయనను బాధించినట్టు తెలుస్తుంది.
Naga Chaitanya : అక్కడ హిట్..
అయితే ఇక్కడ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా విదేశాల్లో మాత్రం ‘లాల్‌సింగ్’ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది విదేశాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రంగా ‘లాల్‌సింగ్ చడ్డా’ నిలిచింది. ఓవర్సీస్‌లో 7.5 మిలియన్ల డాలర్స్ కలెక్ట్ చేసి గంగూబాయి కతియావాడి (7.47 మిలియన్స్ డాలర్స్), భూల్ భూలయ్య 2(5.88 మిలియన్స్ డాలర్స్) పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.126 కోట్లను వసూలు చేసింది. యకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
లాల్ సింగ్ చడ్డా చిత్రం అనేక వివాదాలు, ఆరోపణలతో ఆగస్టు 11 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హిందువుల మనోభాలు దెబ్బ తీసిందనే ఉత్తరాదిలో భారీగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రధాన నగరాల్లో థియేటర్ల వద్ద ఆందోళనలను నిర్వహించారు. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రాలేని పరిస్థితి ఉత్తరాదిలో కనిపించింది. లాల్ సింగ్ చడ్డా చిత్రం భారతీయ సైన్యాన్ని తప్పుడు రీతిలో చిత్రీకరించారనే ఆరోపణలతో అమీర్ ఖాన్‌పై ఢిల్లీ కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఢిల్లీకి చెందిన లాయర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి అని ఫిర్యాదులో పేర్కొన్నారు.