naga chaitanya open up on first love
Naga Chaitanya: అక్కినేని హీరో నాగ చైతన్య గత ఏడాది అక్టోబర్ 2న సమంతకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె నుండి విడిపోయిన తర్వాత చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటూ వస్తున్నాడు. ఎంతో ప్రాణంగా ప్రేమించి సమంతని పెళ్లి చేసుకున్న చైతూ ఇలా ఒంటరి వాడు కావడం అందరిని భాదిస్తుంది. అయితే మనోడు మాత్రం అవేమి పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నట్టు తెలుస్తుంది. అక్కినేని నాగ చైతన్య , డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘థ్యాంక్ యూ. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. రాశీ ఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 22న ఈ సినిమా బిగ్ స్క్రీన్లపై సందడి చేసేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో అంచనలు పెరిగిపోయాయి.
తొలి ప్రేమ..
కొద్ది రోజులుగా చైతూ తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. థ్యాంక్ యూ మూవీలో నటించడానికి గల కారణమని అడగ్గా.. ఈ స్క్రిప్ట్ వినగానే తనలో ఓ ఫీలింగ్ వచ్చిందని.. తన జీవితంతలో స్పెషల్ పర్సన్స్‌కు థ్యాంక్స్ చెప్పాలనిపించిందని నాగ చైతన్య అన్నాడు. ఆ ఫీలింగ్‌తో ఈ సినిమాలో నటించానని చెప్పారు. కథ బాగుందని.. సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ మూవీ వర్క్ చేస్తున్నందుకు తాను నటిస్తున్నట్లు రాశీ ఖన్నా చెప్పింది. ఇక తన స్కూల్ ఏజ్ లవ్ స్టోరీ విషయమై కొన్ని విషయాలు బయటపెట్టారు నాగ చైతన్య. తన జీవితంతలో స్పెషల్ పర్సన్స్‌కు థ్యాంక్స్ చెప్పాలనిపించిందని చెప్పిన నాగ చైతన్య.. అదే ఫీలింగ్‌తో ఈ సినిమాలో నటించానని అన్నారు.
naga chaitanya open up on first love
ఇందులో భాగంగా ఫస్ట్ లవ్ గురించి అడగ్గా తన ఫస్ట్ లవ్ తొమ్మిదో తరగతిలో జరిగిందని.. ముగ్గురం కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేసే వాళ్లమని చెప్పారు నాగ చైతన్య. కానీ చివరకు ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చి తమ హృదయాలను ముక్కలు చేసిందని చెబుతూ ఓపెన్ అయ్యారు.ఆ తర్వాత తాము ముగ్గురం మంచి స్నేహితులుగా మారిపోయామని నాగ చైతన్య అన్నారు. అదేవిధంగా రాశీ ఖన్నా రియాక్ట్ అవుతూ తన ఫస్ట్ లవ్ అనేది బ్యూటీఫుల్ ఫీలింగ్ అని చెప్పింది. మొత్తానికి థ్యాంక్యూ సినిమా రూపంలో చైతూ తన ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ అయ్యాడు.
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
This website uses cookies.