siddharth relation with aditi rao
Siddharth: బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన హీరో సిద్ధార్థ్. ఇందులో ఈ హీరో నటన చాలా మందికి తెగ నచ్చేసింది. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. అయితే ఇటీవల సిద్ధార్థ్ సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు. చైతూ కంటే ముందు సమంత.. సిద్ధార్థ్‌తో ప్రేమాయణం సాగించిందని వార్తలొచ్చాయి. సిద్ధార్థ్ కోసం శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు కూడా చేసింది సమంత. అంతేకాదు సిద్ధార్థ్, సమంత కలిసి `జబర్దస్త్` సినిమాలో నటించారు. ఆ సినిమా టైమ్‌లో వీరిద్దరి మధ్య లవ్ బాగా పెరిగిందని, వీరిద్దరు మ్యారేజ్ కూడా చేసుకునే అవకాశాలున్నాయంటూ వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత సడెన్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు.
ఇప్పుడు సిద్థార్థ్ .. అదితిరావు హైదరితో ప్రేమాయణం మొదలు పెట్టాడని వార్తలు వస్తున్నాయి. అందాల భామ అదితి రావు హైదరి గురించి పరిచయం అవసరం లేదు. నటిగా టాలీవుడ్ లో ఆమె ఫుల్ మార్క్స్ కొట్టేసింది. అవకాశం వచ్చినప్పుడల్లా తనని తాను నిరూపించుకుంటోంది. అదితి చివరగా మహాసముద్రం అనే క్రేజీ మూవీలో నటించింది. ఈ చిత్రంలో అదితి రావు.. హీరో సిద్దార్థ్ కి జంటగా నటించడం విశేషం. తాజాగా వీరిద్దరూ జంటగా ముంబైలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరాకి చిక్కారు. దీంతో త్వరలో విరిద్దరు పెళ్లి పీటలెక్కడం ఖాయం అని తెలుస్తుంది.
siddharth relation with aditi rao
అదితి రావుకి ఆల్రెడీ పెళ్ళై 2013లో బ్రేకప్ జరిగింది. సిద్దార్థ్ కూడా తన భార్య నుంచి విడిపోయి సింగిల్ గా ఉన్నాడు. దీనితో వీరి మధ్య కొత్త ప్రేమ చిగురించింది. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. అయితే వీరిద్దరూ కెమెరాకి జంటగా ఫోజులు ఇచ్చేందుకు నిరాకారించినట్లు తెలుస్తోంది. ముందుగా అదితి సెలూన్ నుంచి వచ్చి కారు ఎక్కింది. ఆ తర్వాత సిద్దార్థ్ అదే కారులో ఎక్కాడు. దీంతో అందరిలో అనుమానాలు బలపడ్డాయి.
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
This website uses cookies.