Naga Chaitanya: నాగ చైత‌న్య మాములోడు కాదు.. ఫ‌స్ట్ ల‌వ్‌పై ఎట్టకేల‌కు నోరు విప్పాడుగా..!

Authored By Sam C | The Telugu News | Published on: July 20, 2022, 9:30 pm

Naga Chaitanya: అక్కినేని హీరో నాగ చైత‌న్య గ‌త ఏడాది అక్టోబ‌ర్ 2న స‌మంత‌కు విడాకులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆమె నుండి విడిపోయిన త‌ర్వాత చాలా రిజ‌ర్వ్‌డ్‌గా ఉంటూ వ‌స్తున్నాడు. ఎంతో ప్రాణంగా ప్రేమించి స‌మంత‌ని పెళ్లి చేసుకున్న చైతూ ఇలా ఒంటరి వాడు కావ‌డం అంద‌రిని భాదిస్తుంది. అయితే మ‌నోడు మాత్రం అవేమి ప‌ట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న‌ట్టు తెలుస్తుంది. అక్కినేని నాగ చైతన్య , డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘థ్యాంక్ యూ. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. రాశీ ఖన్నా, అవికాగోర్‌, మాళవిక నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 22న ఈ సినిమా బిగ్ స్క్రీన్లపై సందడి చేసేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో అంచనలు పెరిగిపోయాయి.
తొలి ప్రేమ‌..

కొద్ది రోజులుగా చైతూ త‌న సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటున్నాడు. థ్యాంక్ యూ మూవీలో నటించడానికి గల కారణమని అడగ్గా.. ఈ స్క్రిప్ట్ వినగానే తనలో ఓ ఫీలింగ్ వచ్చిందని.. తన జీవితంతలో స్పెషల్ పర్సన్స్‌కు థ్యాంక్స్ చెప్పాలనిపించిందని నాగ చైతన్య అన్నాడు. ఆ ఫీలింగ్‌తో ఈ సినిమాలో నటించానని చెప్పారు. కథ బాగుందని.. సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ ఈ మూవీ వర్క్ చేస్తున్నందుకు తాను నటిస్తున్నట్లు రాశీ ఖన్నా చెప్పింది. ఇక తన స్కూల్ ఏజ్ లవ్ స్టోరీ విషయమై కొన్ని విషయాలు బయటపెట్టారు నాగ చైతన్య. తన జీవితంతలో స్పెషల్ పర్సన్స్‌కు థ్యాంక్స్ చెప్పాలనిపించిందని చెప్పిన నాగ చైతన్య.. అదే ఫీలింగ్‌తో ఈ సినిమాలో నటించానని అన్నారు.

naga chaitanya open up on first love

naga chaitanya open up on first love

ఇందులో భాగంగా ఫస్ట్ లవ్ గురించి అడగ్గా తన ఫస్ట్ లవ్ తొమ్మిదో తరగతిలో జరిగిందని.. ముగ్గురం కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేసే వాళ్లమని చెప్పారు నాగ చైతన్య. కానీ చివరకు ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చి తమ హృదయాలను ముక్కలు చేసిందని చెబుతూ ఓపెన్ అయ్యారు.ఆ తర్వాత తాము ముగ్గురం మంచి స్నేహితులుగా మారిపోయామని నాగ చైతన్య అన్నారు. అదేవిధంగా రాశీ ఖన్నా రియాక్ట్ అవుతూ తన ఫస్ట్ లవ్ అనేది బ్యూటీఫుల్ ఫీలింగ్ అని చెప్పింది. మొత్తానికి థ్యాంక్యూ సినిమా రూపంలో చైతూ త‌న ఫ‌స్ట్ ల‌వ్ గురించి ఓపెన్ అయ్యాడు.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp