Naga Chaitanya : నాగ చైత‌న్య‌కి సోష‌ల్ మీడియాలో ఇంత భారీ రెస్పాన్స్ వ‌స్తుందేంటి…!

Authored By Sam C | The Telugu News | Published on: March 23, 2022, 9:00 pm

Naga Chaitanya : అక్కినేని వార‌సుడు నాగ చైత‌న్య స్లో అండ్ స్ట‌డీగా త‌న కెరీర్ కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. విడాకుల త‌ర్వాత మ‌నోడు కూడా జోరు పెంచాడు.ప‌ర్స‌న‌ల్ విష‌యాల జోలికి వెళ్లకుండా కెరీర్‌పైనే దృష్టి సారిస్తున్నాడు. త‌మ విడాకుల‌కి సంబంధించి స‌మంత ఇన్‌డైరెక్ట్‌గా చాలా పోస్ట్‌లు పెట్టిన నాగ చైత‌న్య మాత్రం ఎక్కువ‌గా రియాక్ట్ కాలేదు. ఇక విడాకుల అనంతరం సినిమాల పరంగా ఇద్దరూ ఫుల్‌ బిజీ అయ్యారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌తో నాగ చైతన్య దూసుకుపోతుంటే సమంత కూడా బాలీవుడ్‌ సహా హాలీవుడ్‌ ప్రాజెక్టులతో అదరగొడుతుంది.విడాకుల అనంతరం కుంగిపోయిన సమంత.. చైతూతో గడిపిన జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుంది.

ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి నాగ చైతన్య ఫోటోలను డిలీట్‌ చేసిన సామ్‌ రీసెంట్‌గా అతన్ని అన్‌ఫాలో కూడా చేసేసింది. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున,రానా, వెంకటేష్‌ కుమార్తె ఆశ్రితలను ఇంకా ఫాలో అవుతున్న సామ్‌ చైతన్యను మాత్రమే అన్‌ఫాలో చేసింది. అయితే చైతూ సోష‌ల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండడు అనే విష‌యం తెలిసిందే.అప్పుడ‌ప్పుడు మాత్రమే కెరీర్‌ విషయాలతో పాటు ఫోటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తన ఫాలోవర్స్‌ని అట్రాక్ట్‌ చేస్తుంటాడు.ఈ క్ర‌మంలో చైతూ ఫాలోయింగ్‌ రోజు రోజుకు పెరిగిపోతుంది.

naga chaitanya reaches new mile stone

naga chaitanya reaches new mile stone

Naga Chaitanya : చైత‌న్య త‌గ్గేదేలే అంటున్నాడుగా..

తాజాగా ఈ అక్కినేని హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్స్‌పైగా ఫాలోవర్లను రీచ్‌ అయ్యాడు. ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది టాలీవుడ్‌ హీరోల జాబితాలో చైతూ చేరాడు. ఈ నేపథ్యంలో అక్కినేని అభిమానులు చైతూకి అభినందనలు తెలియజేస్తున్నారు. అక్కినేని నట వారసుడు యువసామ్రాట్ నాగ చైతన్య ‘జోష్’ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేయ‌గా, ఆ తర్వాత వచ్చిన ‘ఏమాయ చేశావే’తో హిట్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇలా నాగ చైతన్య ఎన్నో విజయాలను అందుకోవడంతో పాటు కొన్ని పరాజయాలను సైతం చవి చూసిన విషయం తెలిసిందే.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp