Naga Chaitanya : ఎట్ట‌కేలకు స‌మంత‌తో విడాకుల పై స్ఫంధించిన నాగ‌చైత‌న్య

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 24, 2021, 2:30 pm

Naga Chaitanya : గత కొన్ని రోజులు సోషల్ మీడియాను సమంత నాగ చైతన్య విడాకుల రూమర్లు ఊపేస్తున్నాయి. రోజు కో కొత్త రకమైన వార్తలు ఆ ఇద్దరి మీద వస్తున్నాయి.కానీ ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా ఆ రూమర్లపై నాగ చైతన్య గానీ, సమంత గానీ స్పందించడం లేదు. ఇక సమంత అయితే పరోక్షంగా కొన్ని నీతి సూక్తులు, వేధాంత ధోరణి మాటలు, పరోక్షంగా ప్రేమను తెలిపే కొటేషన్లను షేర్ చేస్తోంది. వాటి ఉద్దేశ్యం ఏంటో సమంతకు మాత్రమే తెలియాలి.

Naga Chaitanya Reacts On Social Media Rumors

Naga Chaitanya Reacts On Social Media Rumors

ఇక నాగ చైతన్య అయితే సోషల్ మీడియాకు కిలో మీటర్ల దూరంలో ఉంటాడు. తన సినిమా రిలీజ్ సమయంలోనే కాసింత యాక్టివ్‌గా ఉంటాడు. ఇక మిగిలిన టైంలో వాటి జోలికే పోడు. అలాంటి చై.. తాజాగా లవ్ స్టోరీ ప్రమోషన్స్‌లో భాగంగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ..

Naga Chaitanya Reacts On Social Media Rumors

Naga Chaitanya Reacts On Social Media Rumors

సోషల్ మీడియాలో వచ్చే రూమర్లపై స్పందించాడు. కెరీర్ ప్రారంభంలో రూమర్లు బాగా వచ్చేవి. ఆ సమయంలో చాలా ఫీలయ్యాను. ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తుంటారు? అని బాధపడ్డాను. అప్పట్లో సితార వంటి మ్యాగజైన్స్ నెలకు ఒకసారి వచ్చేవి.

Naga Chaitanya  టీఆర్పీల కోసం అలా..

Naga Chaitanya Reacts On Social Media Rumors

Naga Chaitanya Reacts On Social Media Rumors

అప్పుడు నెలంతా వాటి గురించే మాట్లాడుకునే వారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక వార్త వస్తుంది.. మరుక్షణంలో మరో కొత్త వార్త వస్తుంది. అలా ఇప్పుడు టీఆర్పీలో కోసం రూమర్లు రాస్తున్నారు. కానీ ఎక్కువ కాలం అవి నిలబడవు. ఎప్పటికైనా నిజమైన వార్తలే నిలుస్తాయి. ఇక నేను మాత్రం నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను వేర్వేరుగానేచూస్తాను అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పుడు వస్తున్న రూమర్లను కూడా తాను పట్టించుకోవడం లేదని చెప్పేశాడు. కానీ విడాకుల విషయం నిజమో, అబద్దమో మాత్రం చెప్పలేదు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp