Naga Chaitanya : ఆమెకు న‌చ్చ‌లేదెమో… అందుకే వెళ్లిపోయింది.. సమంతతో విడాకులపై నాగచైతన్య..?

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 17 January 2022, 8:30 pm

Naga Chaitanya : టాలీవుడ్ లోనే క్రేజీ జంట ఏది అంటే టక్కున చెప్పే సమాధానం నాగ చైతన్య, సమంత. ఇద్దరూ చాలా ఏళ్ల పాటు సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వాళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా గోవాలో జరిగింది. వాళ్లు పెళ్లి చేసుకోముందు వాళ్ల రిలేషన్ షిప్ గురించి సోషల్ మీడియాలో చాలా పుకార్లు వచ్చాయి.ఏది ఏమైనా.. చివరకు వాళ్లు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2017లో ఒక్కటయ్యారు. కానీ.. వాళ్లు విడిపోతారు అని ఎవ్వరూ ఊహించలేదు. ఏ తెలుగు సినీ అభిమాని కూడా వాళ్లు విడిపోవాలని కోరుకోలేదు. కానీ.. విధి వక్రించింది. వాళ్లు ఇద్దరూ విడిపోయారు.

అయితే.. నాగ చైతన్య, సమంత.. ఇద్దరూ విడిపోతున్నట్టు మీడియాకు ముందే లీక్ అయింది. దీంతో మీడియాలో వాళ్లు విడిపోతున్నారని.. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారని పుంఖానుపుంఖలుగా కథనాలు ప్రసారం చేశారు. చివరకు అందరూ అనుకున్నట్టుగానే వాళ్లు విడిపోయారు.ఇద్దరం.. మ్యూచువల్ గా అంగీకారంతో విడిపోతున్నట్టు తమ ఇన్ స్టాలో ప్రకటించారు. దీంతో టాలీవుడ్ సినీ అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా ఒక్కసారిగా అవాక్కయింది.ఏది ఏమైనా.. ఇప్పుడు ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. మేము భార్యాభర్తలుగా విడిపోయినా.. ఫ్రెండ్స్ గా ఎప్పటికీ ఉంటాం అని వాళ్లు ప్రకటించినా..

naga chaitanya responds on his divorce with samantha

naga chaitanya responds on his divorce with samantha

Naga Chaitanya : ఇద్దరూ విడిపోతున్నట్టు ముందే మీడియాకు లీక్

ఆ తర్వాత వాళ్లు కలిసి కనిపించింది లేదు.వాళ్ల విడాకుల గురించి కూడా పెద్దగా ఎప్పుడూ స్పందించలేదు. మధ్యలో రెండుమూడు సార్లు సమంత తన విడాకుల గురించి ప్రస్తావించింది కానీ.. నాగ చైతన్య పెద్దగా ఆ మ్యాటర్ గురించి మాట్లాడలేదు.కానీ.. తాజాగా బంగార్రాజు మూవీ కోసం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య.. తన విడాకులపై స్పందించాడు. కొన్ని సార్లు అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తను హ్యాపీ.. నేను హ్యాపీ.. తనకు నచ్చలేదు.. వెళ్లిపోయింది. ఏం చేసినా తను సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది.. అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

  1. "Karthika Deepam 2 Today Episode 2026 July 23 : కార్తీక దీపం 2.. మాలినీ మాస్టర్ ప్లాన్‌కు శివన్నారాయణ షాకింగ్ కౌంటర్.. చివర్లో ఊహించని ట్విస్ట్..!"

  2. "Gold Rate Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. రూ.40 వేల తక్కువగానే ఉంది.. కొనాలనుకునేవారికి ఇదే ఛాన్స్ ?"

  3. "Telangana Heavy Rain : తెలంగాణలో మరో 48 గంటలు కుండపోత ఖాయం.. ఈ జిల్లాలు జాగ్రత్త IMD!"

  4. "Yawning : ఎదుటివారు ఆవలిస్తే మనకూ ఎందుకు ఆవలింత వస్తుంది? 99% ఎవ‌రికి తెలియ‌దు..!"

  5. "Rainy Season Vegetables : వర్షాకాలంలో ఈ 4 కూరగాయలు తింటే డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిందే..!"

  6. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  7. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి