Naga Chaitanya : నాగ చైత‌న్య రెండో పెళ్లిపై వ‌చ్చిన క్లారిటీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naga Chaitanya : నాగ చైత‌న్య రెండో పెళ్లిపై వ‌చ్చిన క్లారిటీ..!

 Authored By sandeep | The Telugu News | Updated on :20 April 2022,2:30 pm

Naga Chaitanya: అక్కినేని వార‌సుడు నాగ చైత‌న్య కొన్ని నెల‌ల క్రితం తాను ఎంత‌గానో ప్రేమించిన స‌మంత‌కు విడాకులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అక్టోబ‌ర్ 2న వీరిద్ద‌రు విడాకులు తీసుకోగా, అప్పటి నుండి సోలోగా లైఫ్ సాగిస్తున్నారు. ప్రస్తుతం నాగ చైత‌న్య‌ తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉండగా.. మరోసారి తన పర్సనల్ లైఫ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ టాక్ వినిపిస్తోంది. విడాకులు అయ్యి చాలా నెలలు కావస్తుండడంతో నాగచైతన్య మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అది కూడా ఒక హీరోయిన్‌తో అని కూడా కొందరు నెటిజన్లు కన్ఫర్మ్ చేసేస్తున్నారు.తాజాగా ఈ పుకార్ల‌పై నాగ చైత‌న్య టీం స్పందించింది. చైతూ రెండో పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ నిరాధారం. అందులో ఎలాంటి వాస్త‌వం లేదు అని క‌న్‌ఫాం చేశారు. దీంతో చైతూ రెండో పెళ్లికి సంబంధించిన పుకార్ల‌కి బ్రేక్ ప‌డ్డ‌ట్టు అయింది. తెలుగు సినిమా రంగంలో 70 ఏళ్ల చ‌రిత్ర‌తో పాటు మంచి పేరు ప్ర‌ఖ్యాతులు ఉన్న అక్కినేని కుటుంబంలోకి కోడ‌లిగా వెళ్లిన స‌మంత‌.. చైతుతో జీవితాంతం క‌లిసి ఉంటే చ‌రిత్ర‌కు ఎక్కేది. ఆమె పేరు తెలుగు గ‌డ్డ‌పై చిర‌స్థాయిగా నిలిచి ఉండేది.

naga chaitanya team denies the rumors

naga chaitanya team denies the rumors

Naga Chaitanya : క్లారిటీ వ‌చ్చేసిందిగా..

కాని ఆమె ఆ ఫ్యామిలీ కోడ‌లిగా నాలుగేళ్లు మాత్ర‌మే కొన‌సాగింది.గ‌తేడాది అక్టోబ‌ర్ 2న చైతు, స‌మంత అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల‌కు ముందు నాలుగు నెల‌ల నుంచే స‌మంత బిహేవియ‌ర్‌తో పాటు సోష‌ల్ మీడియాలో ఆమె పెట్ట‌కుంటూ వ‌స్తోన్న పోస్టులు చూసే చాలా మంది ఏదో తేడా కొడుతోంద‌న్న సందేహాలు వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు వారు ఊహించిందే జ‌రిగింది. విడాకుల త‌ర్వాత కూడా ఈ జంట‌పై అనేకానేక రూమ‌ర్లు వ‌చ్చాయి. అయితే చైతు మాత్రం పెద్ద‌గా ఈ విష‌యంలో రియాక్ట్ కాలేదు. త‌న ప‌నేదో తాను చేసుకుపోయాడు. అయితే స‌మంత మాత్రం ఎప్పుడూ ఏదో అర్థం వ‌చ్చేలాగానే పోస్టులు పెడుతూ వ‌చ్చింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది