Naga Chaitanya : సొంత మరదలుతో నాగ చైతన్య.. రెస్టారెంట్ లోనే బావా అంటూ చైతూను హగ్ చేసుకుంది.. వీడియో వైరల్
Naga Chaitanya : నాగ చైతన్యకు మరదలు ఉందా? అని ఆశ్చర్యపోకండి. విక్టరీ వెంకటేశ్ కూతుళ్లు చైతూకు మరదళ్లే కదా. అవును.. వెంకటేశ్ సోదరే.. నాగ చైతన్య తల్లి. కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల.. నాగార్జున, నాగ చైతన్య తల్లి విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున అమలను పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు అఖిల్ పుట్టాడు. అయితే.. నాగ చైతన్య.. అక్కినేని ఫ్యామిలీతో ఎంత క్లోజ్ గా ఉంటాడో.. దగ్గుబాటి ఫ్యామిలీతో కూడా అంతే క్లోజ్ గా ఉంటాడు. అటు రామానాయుడు ఫ్యామిలీ, ఇటు నాగేశ్వర రావు ఫ్యామిలితో కలిసి మెలిసి ఉంటాడు.
తన చిన్నప్పటి నుంచి తన తల్లి దగ్గరే ఉంటున్నా.. ఆ తర్వాత నాగార్జున దగ్గరికి వచ్చేశాడు చైతన్య. హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు.ప్రస్తుతం తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. స్టార్ హీరోగా ఎదిగాడు కానీ.. తన పర్సనల్ లైఫే అంతగా బాగోలేదు. తనకు కూడా విడాకులు అయ్యాయి. నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నా వాళ్లు ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయి ఎవరికి వారు తమ పనుల్లో బిజీ అయిపోయారు.
Naga Chaitanya : అశ్రితతో కలిసి ఫుడ్ వ్లాగ్ చేసిన వెంకటేశ్
కట్ చేస్తే.. వెంకటేశ్ కూతురు అశ్రితతో కలిసి తాజాగా చైతూ ఓ వీడియోలో కనిపించాడు. వెంకటేశ్ కూతురు అశ్రితకు ఒక యూట్యూబ్ చానెల్ ఉంది. అందులో తను రకరకాల ఫుడ్ ను ఎక్స్ ప్లోర్ చేస్తుంటుంది. తాజాగా నాగ చైతన్యకు చెందిన షోయూ అనే జపనీస్ రెస్టారెంట్ కు వెళ్లిన అశ్రిత.. అక్కడ వంటే రకరకాల వంటలు, కాంటినెంటల్ ఫుడ్ గురించి అశ్రిత.. చైతూతో కలిసి వ్లాగ్ చేసింది. ఆ వీడియోలో ఆ రెస్టారెంట్ లో లభించే అన్ని రకాల వంటకాల గురించి అశ్రిత వివరిస్తుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
