Naga Chaitanya wants to act with Alia Bhatt
Naga Chaitanya : అక్కినేటి నట వారసుడు ఇటీవలే వివాహమైన హీరోయిన్ పై మనసు పడ్డట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. అక్కినేని నటవారసుడు బాలీవుడ్ హీరోయిన్ పై కన్నేశాడని తెలియడంతో ఎవరావిడా అని అంతా తెగ వెతుకుతున్నారట.. ఆమె మరెవరో కాదు..రణబీర్ కపూర్ భార్య అలియాభట్.. అలియా నటనంటే కూడా తనకు ఎంతో అభిమానమని కూడా పేర్కొన్నాడు.
అక్కినేని నాగ చైతన్య సమంతకు విడాకులు ఇచ్చి పది నెలలు కావొస్తుంది. టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీరు ప్రస్తుతం విడిపోయి విడివిడిగా ఎవరి జీవితాన్ని వారు లీడ్ చేస్తున్నారు.సామ్ చై ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఇక నాగచైతన్య మాత్రం ఇటీవల బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా మూవీలో అమీర్ ఖాన్ సరసన నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా అనేది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్దగా నడవలేదు. ఆ సినిమాలో చైతన్య చేసిన బాలరాజు పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. నాగచైతన్య ఈ మూవీ కోసం ఎక్కువగా బాలీవుడ్‌లో తన టైంను కేటాయించాల్సి వచ్చింది.
Naga Chaitanya wants to act with Alia Bhatt
దాంతో తరచూ అక్కడ మీడియాతో ఇంట్రాక్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే మీకు బాలీవుడ్‌లో సినిమా అవకాశం వస్తే చేస్తారా? అని అక్కడి మీడియా అడుగగా చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు చైతూ.. బాలీవుడ్‌లో హీరోగా అవకాశమస్తే ఏ హీరోయిన్‌తో కలిసి నటించాలి అనుకుంటున్నావు అని అడుగగా.. కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, అలియా భట్ వంటి హీరోయిన్లతో నటించాలని అనుకుంటున్నాను. అంతేకాకుండా అలియా భట్ నటనంటే నాకు చాలా ఇష్టం.ఐ లవ్ హర్ యాక్టింగ్. ఆమెతో సినిమా ఛాన్స్ వస్తే మాత్రం ఇక అస్సలు వదులుకోను అని చైతూ క్లారిటీ ఇచ్చాడు.అలాగే నీకు సెలబ్రిటీలలో ఎక్కువగా ఎవరు ఇష్టం అని అడగగా మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ అంటే చాలా ఇష్టమని చైతూ చెప్పుకొచ్చాడు.
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
This website uses cookies.