Naga Shaurya : టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కళ్లు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. పెళ్లి సమయం వస్తే ఇక ఎవరు ఆగరు కాబట్టి మూడు ముళ్లు వేసేందుకు రెడీ అవతున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరోలలో ఒకరిగా ఉన్న నాగశౌర్య ఈ ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈ విషయాన్ని నాగశౌర్యనే స్వయంగా చెప్పాడు. తాజా సినిమా కృష్ణ వ్రిందా విహారి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగశౌర్యకు మీ పెళ్లి ఎప్పుడు ? అన్న ప్రశ్న ఎదురయింది. దీనికి నాగశౌర్య ఆన్సర్ చేస్తూ ఈ ఏడాదిలోనే నా పెళ్లి ఉండే ఛాన్స్ ఉందని.. తాను చేసుకోబోయే అమ్మాయి తెలుగమ్మాయి అని ఆ సీక్రెట్ ను రివిల్ చేసేశాడు.
నాగ శౌర్య తెలుగమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంపదీసి తెలుగు హీరోయిన్‌ని పెళ్లాడడు కదా అంటూ కొందరు అనుమానపడుతున్నారు.ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, ఛలో వంటి సినిమాలతో హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వరుడు కావలెను సినిమాతో పలకరించిన నాగ శౌర్య తాజాగా నటించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి. పాపులర్ సింగర్ షెర్లీ సేథియా హీరోయిన్ గా తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది.
ఈ మూవీ ఇవాళ అంటే సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం కూడా కాస్త నిరాశపరచింది. కృష్ణ వ్రింద విహారి చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాగా, కథ పాతదే అయినా, స్క్రీన్ ప్లే బాగుంది ఇంటర్వెల్ కు ముందు వచ్చే ట్విస్ట్ స్టోరీని మలుపు తిప్పుతుంది. హీరోయిన్ షెర్లీ సేథియా అందంగా కనిపించింది. ఎప్పటిలాగే నాగ శౌర్య కూల్ నటనతో ఆకట్టుకున్నాడు. 22 జనవరి 1989న తూర్ప గోదావరి జిల్లా ఏలూరిలో జన్మించిన నాగ శౌర్య విజయవాడలో పెరిగాడు. ఆ తర్వాతా వీరి ఫ్యామిలీ హైదరాబాద్‌కు షిప్ట్ అయింది. ఇక నాగ శౌర్య 2011లో వచ్చిన ‘క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ‘చందమామ కథలు’ సినిమా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.