Naga Shaurya : ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్న నాగ శౌర్య‌.. అమ్మాయి ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌ల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naga Shaurya : ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్న నాగ శౌర్య‌.. అమ్మాయి ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌ల్సిందే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :23 September 2022,9:00 pm

Naga Shaurya : టాలీవుడ్ హీరోలు ఒక్కొక్క‌ళ్లు పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. పెళ్లి స‌మ‌యం వ‌స్తే ఇక ఎవ‌రు ఆగ‌రు కాబ‌ట్టి మూడు ముళ్లు వేసేందుకు రెడీ అవ‌తున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరోలలో ఒక‌రిగా ఉన్న‌ నాగశౌర్య ఈ ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని నాగ‌శౌర్య‌నే స్వ‌యంగా చెప్పాడు. తాజా సినిమా కృష్ణ వ్రిందా విహారి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగశౌర్యకు మీ పెళ్లి ఎప్పుడు ? అన్న ప్రశ్న ఎదురయింది. దీనికి నాగశౌర్య ఆన్సర్ చేస్తూ ఈ ఏడాదిలోనే నా పెళ్లి ఉండే ఛాన్స్ ఉందని.. తాను చేసుకోబోయే అమ్మాయి తెలుగమ్మాయి అని ఆ సీక్రెట్ ను రివిల్ చేసేశాడు.

నాగ శౌర్య తెలుగ‌మ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని తెలిసి అంద‌రు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంప‌దీసి తెలుగు హీరోయిన్‌ని పెళ్లాడ‌డు క‌దా అంటూ కొంద‌రు అనుమానప‌డుతున్నారు.ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, ఛలో వంటి సినిమాలతో హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వరుడు కావలెను సినిమాతో పలకరించిన నాగ శౌర్య తాజాగా నటించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి. పాపులర్ సింగర్ షెర్లీ సేథియా హీరోయిన్ గా తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది.

Naga Shaurya marries this year

Naga Shaurya marries this year

Naga Shaurya : పెళ్లి గ‌డియ‌లు..

ఈ మూవీ ఇవాళ అంటే సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం కూడా కాస్త నిరాశ‌ప‌ర‌చింది. కృష్ణ వ్రింద విహారి చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాగా, కథ పాతదే అయినా, స్క్రీన్ ప్లే బాగుంది ఇంటర్వెల్ కు ముందు వచ్చే ట్విస్ట్ స్టోరీని మలుపు తిప్పుతుంది. హీరోయిన్ షెర్లీ సేథియా అందంగా కనిపించింది. ఎప్పటిలాగే నాగ శౌర్య కూల్ నటనతో ఆకట్టుకున్నాడు. 22 జనవరి 1989న తూర్ప గోదావరి జిల్లా ఏలూరిలో జన్మించిన నాగ శౌర్య‌ విజయవాడలో పెరిగాడు. ఆ తర్వాతా వీరి ఫ్యామిలీ హైదరాబాద్‌కు షిప్ట్ అయింది. ఇక నాగ శౌర్య 2011లో వచ్చిన ‘క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ‘చందమామ కథలు’ సినిమా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది